ఛాన్సులు రాలేదంటారు, వచ్చాక వేరే భాషలోకి వెళ్తారు
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ టైమ్, కెరీర్ హీరోయిన్లకు ఉండదు. ఎంత వేగంగా సక్సెస్ అవుతారో అంతే వేగంగా ఫేడవుట్ అయిపోతూ ఉంటారు హీరోయిన్లు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 7:55 PM ISTసినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ టైమ్, కెరీర్ హీరోయిన్లకు ఉండదు. ఎంత వేగంగా సక్సెస్ అవుతారో అంతే వేగంగా ఫేడవుట్ అయిపోతూ ఉంటారు హీరోయిన్లు. ప్రతీ వారం కొత్త భామలు వస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఉన్న వాళ్లు కొత్త అవకాశాలను అందుకుంటూ తమ ఫేమ్ ను మరింత పెంచుకుంటూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో తెలుగు భామలకు ఎక్కువ అవకాశాలు రావనే కామెంట్ మాత్రం ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది.
దానికి కారణం టాలీవుడ్ సినిమాల్లో తెలుగు భామల కంటే పరాయి భాష నుంచి వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు లభించడమే. ఈ విషయంలో ఇప్పటికే ఎంతో తెలుగమ్మాయిలు తమ అసంతృప్తిని వెల్లిబుచ్చారు. అయితే రీసెంట్ గా 12A రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై మాట్లాడగా, అతను మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 21న అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ రిలీజ్
నాని కాసరగడ్డ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా 12A రైల్వే కాలనీ. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించగా, నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామాక్షి గురించి మాట్లాడుతూ, ఆమె చాలా టాలెంటెడ్ అని, యాక్టింగ్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన అన్ని పనుల్లోనూ యాక్టివ్ గా ఉంటుందని నరేష్ చెప్పారు.
టాలీవుడ్ ను వదలొద్దని హీరోయిన్ కు సలహా
కాగా కామాక్షి భాస్కర్ల తెలుగమ్మాయి అనే విషయం తెలిసిందే. పొలిమేర సినిమాతో కామాక్షికి చాలా మంచి పేరొచ్చింది. వృత్తిపరంగా డాక్టర్ అయిన కామాక్షి సినిమాల్లోకి వస్తూ డాక్టర్ వృత్తిని వదిలేశారు. నటి అయ్యాక పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కామాక్షిని ఉద్దేశించి నరేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగమ్మాయిలకు అవకాశాలు వచ్చే వరకు రాలేదంటారని, అవకాశాలొచ్చాక వేరే భాషలకు వెళ్లిపోతారని, కానీ కామాక్షి నువ్వు అలా వెళ్లొద్దు, ఛాన్సులొస్తే బయట కూడా సినిమాలు చెయ్ కానీ తెలుగుని మాత్రం వదిలి వెళ్లొద్దని సూచించగా, ఇప్పుడా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
