Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

తాను సినిమాల్లో సంపాదించిన డబ్బంతా రాజకీయాల్లోకి వచ్చాక ఖర్చయిపోయిందని సీనియర్ నటుడు నరేష్ తెలిపారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చే అలవాటు కూడా ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం తల్లి విజయనిర్మల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయని, సినిమాల్లో బిజీగా ఉంటూ సంపాదనను దాచుకుంటున్నానని వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   10 Nov 2026 1:00 AM IST
సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?
X

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల దంప‌తుల న‌ట‌వార‌సుడు. ఇద్ద‌రు దిగ్గ‌జాల వార‌సుడిగా టాలీవుడ్ లో ఆయన సినీకెరీర్ కూడా అసాధార‌ణంగానే సాగింది. సీనియ‌ర్ హీరోగా, హాస్య చిత్రాల క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ఒక రేంజు ఉంద‌ని నిరూపించారు.

అయితే ఆయ‌న రేంజు ఎంత ఉన్నా స్వ‌యంగా సంపాదించిన‌ది అంతా పోగొట్టుకున్నాన‌ని అన‌డం చాలా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అస‌లు ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ న‌టుడిగా తన స్వీయార్జ‌న‌ను ఎలా పోగొట్టుకున్నాడో వివ‌రించిన తీరు చూసాక నిజంగా అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

తాగుడు మానేసాను... ఇంట్లో 2 పెగ్గులు.. అప్పుడ‌ప్పుడు స్నేహితుల‌తో పార్టీ త‌ప్ప ఇంకేదీ లేదు. ఈ మ‌ధ్య అదీ కూడా లేదు.. ఆల్క‌హాల్ మానేసాన‌ని తెలిపారు. జూదం లేదు.. ల‌గ్జ‌రీ కార్లు కొనే అల‌వాటు ఉన్నా అది కూడా ఆస్తులు పోగొట్టుకోవ‌డానికి కార‌ణం కాదు.. కొన్నేళ్ల క్రితం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్నీ క‌రిగిపోయాయి. ఒకానొక ద‌శ‌లో అకౌంట్ ఖాళీ అయిపోయింది. ధాన‌ధ‌ర్మాలు అన‌కూడ‌దు కానీ ఒకానొక ద‌శ‌లో జేబులో ఎంత ఉంటే అంతా తీసి అడిగిన వారికి ఇచ్చేసేవాడిని. అది వార‌స‌త్వంగా వ‌చ్చిన అల‌వాటు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాకే ఉన్న‌దంతా క‌రిగిపోయి జీరోకి వ‌చ్చేసాను అని తెలిపారు. ఈ రంగంలో ఇవ్వ‌డ‌మే కానీ తిరిగి వ‌చ్చేది ఏమీ ఉండ‌దు క‌దా! అని కూడా విశ్లేషించారు.

అయితే ఇండ‌స్ట్రీలో తాను సంపాదించిన‌ది పోగొట్టుకున్నా కానీ, త‌న త‌ల్లి దివంగ‌త న‌టి, ద‌ర్శ‌క‌నిర్మాత‌ విజ‌య‌నిర్మ‌ల నుంచి వ‌చ్చిన ఆస్తులు కోకొల్ల‌లు. ఇప్పుడు అవి వంద‌ల వేల కోట్లు. నాన‌క్ రామ్ గూడ‌లో సొంత ఇల్లు స‌హా ప‌లు ఫామ్ హౌస్ లు, తోట‌లు ఔట‌ర్ లో విలువైన‌ భూములు ఆస్తులు ఉన్నాయి. హైద‌రాబాద్, చెన్నై స‌హా ప‌లు చోట్ల ఆస్తులున్నాయి. ఇటీవ‌లి కాలంలో న‌టుడిగా ఫుల్ బిజీగానే ఆర్జిస్తున్నారు న‌రేష్. ఈ మ‌ధ్య కాలంలో రియ‌లైజేష‌న్ వ‌చ్చాక డ‌బ్బు కూడా దాస్తున్నారు. మొత్తానికి సీనియ‌ర్ న‌రేష్ క‌ల్మ‌షం లేని మ‌న‌సు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

సీనియర్ న‌రేష్ ఇటీవ‌లి కెరీర్ జ‌ర్నీని ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల అగ్ర హీరోల సినిమాల‌తో పాటు న‌వ‌త‌రం స్టార్ల‌తోను క‌లిసి ప‌ని చేస్తున్నారు. సంక్రాంతికి వ‌స్తున్నాం, గేమ్ ఛేంజ‌ర్, సుంద‌ర కాండ, మాస్ జాత‌ర‌, చాంపియ‌న్ లాంటి చిత్రాల‌తో పాటు, `దీవానా, `నారీ నారీ నడుమ మురారి`, `ఫ్యామిలీ ప్యాక్` వంటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్లలోను న‌టించారు. శ్రీ‌నివాస మంగాపురం వంటి యాక్ష‌న్ చిత్రంలో పాత్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకున్న డిమాండ్ దృష్ట్యా కామెడీ నుంచి సీరియస్ రోల్స్ వరకు ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత ఉండేలా కథలను ఎంచుకుంటూ బిజీగా గడుపుతున్నారు.