Begin typing your search above and press return to search.

గురూజీ టైమింగ్.. వెంకీ వైబ్స్: నారా రోహిత్ స్మార్ట్ మూవ్

సోలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న నారా రోహిత్, వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో ప్రాజెక్ట్ లో కనిపించడం చాలామందిని సర్ప్రైజ్ చేసింది.

By:  M Prashanth   |   29 Oct 2026 2:49 PM IST
గురూజీ టైమింగ్.. వెంకీ వైబ్స్: నారా రోహిత్ స్మార్ట్ మూవ్
X

సోలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న నారా రోహిత్, వెంకటేష్ ఆదర్శ కుటుంబంలో ప్రాజెక్ట్ లో కనిపించడం చాలామందిని సర్ప్రైజ్ చేసింది. రెగ్యులర్ గా హీరో రోల్స్ చేసే వాళ్లు ఇలాంటి పెద్ద కాంబోలోకి వచ్చినప్పుడు స్క్రీన్ స్పేస్ ఎంత దొరుకుతుందనే అనుమానాలు రావడం సహజం. కానీ ఆదర్శ కుటుంబం కోసం రోహిత్ ఎంచుకున్న ఈ రూట్ చూస్తే, కేవలం ఒక పాత్ర చేయడమే కాకుండా కెరీర్ ను రీఫ్రెష్ చేసుకునేందుకు వేసిన పక్కా స్మార్ట్ స్టెప్ లా అనిపిస్తోంది.

త్రివిక్రమ్ తో వర్క్ చేయడం చాలా బాగుంటుంది కానీ ప్రాసెస్ కాస్త టైమ్ తీసుకుంటుందంటూ రోహిత్ వేసిన లైట్ హార్టెడ్ కౌంటర్ ఇక్కడ అసలు హైలైట్. సాధారణంగా డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ పై పబ్లిక్ లో కామెంట్ చేయాలంటే గట్టి ర్యాపో ఉండాలి. సీన్ బాగా రావడం కోసం గురూజీ ఎక్కువ టైమ్ తీసుకుంటారనే విషయాన్ని కంప్లైంట్ లా కాకుండా చాలా కూల్ గా చెప్పడం రోహిత్ ఈ ప్రాజెక్ట్ ను ఎంత ఎంజాయ్ చేశారో స్పష్టం చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లో తను చాలా విషయాలు నేర్చుకున్నానని రోహిత్ ఓపెన్ గా చెప్పాడు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ టైమింగ్ అందుకోవడం ఏ యాక్టర్ కైనా మంచి ఎక్స్‌పీరియన్స్. అలాంటి స్కోప్ దొరికినప్పుడు సొంత అభిప్రాయాలు పక్కనపెట్టి కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని చూడటం ఒక నటుడిగా రోహిత్ తీసుకున్న మంచి డెసిషన్.

ఇక సెట్స్ లో వెంకటేష్ తో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ, ఆయన చాలా స్పిరిచువల్ గా మాట్లాడతారని గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న వెంకీ పక్కన చేసినప్పుడు వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి యాక్టర్స్ కు పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా సీన్లు చేసుకుంటూ వెళ్లే వెంకీ వైబ్ రోహిత్ కు కూడా బాగా హెల్ప్ అయినట్లు కనిపిస్తోంది.

ట్రైలర్ అందరికీ నచ్చేసిందని, సినిమా కూడా పక్కాగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ రోహిత్ లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకుండా కంటెంట్ మీదే భారం వేస్తూ చాలా బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడారు. తమన్ ఆల్రెడీ చెప్పినట్లు ఈ సినిమాలో రోహిత్ రోల్ ఒక ఐఓపెనర్ లా ఉంటుందనే టాక్ చూస్తుంటే, కథను టర్న్ చేసే కీలకమైన పాయింట్ ఆయన చుట్టూనే ఉండొచ్చనిపిస్తోంది.

రొటీన్ సోలో సినిమాలతో సేఫ్ గేమ్ ఆడటం కంటే, ఒక బలమైన కథలో మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఎంచుకోవడం ఎప్పుడూ బెటర్ ఛాయిస్. రేపు థియేటర్లలో పడే రిజల్ట్ రోహిత్ రోల్ కు పాజిటివ్ గా వస్తే మాత్రం, భవిష్యత్తులో ఆయన సరికొత్త క్యారెక్టర్లతో సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా స్పీడ్ గా పరిగెత్తించే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఆ పాత్ర ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో.