Begin typing your search above and press return to search.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

దీంతో చాలా కాలంగా నారా వార‌బ్బాయి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రోహిత్ కోరిక ఇన్నాళ్ల‌కు తీరింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Sept 2025 12:23 AM IST
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నారా రోహిత్ ఒక‌రు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి సోదరుడి కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్, త‌క్కువ టైమ్ లోనే న‌టుడిగా త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రీ ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల‌తో త‌న‌దైన మార్క్ వేసుకున్న నారా రోహిత్ త‌ర్వాత ట్రాక్ త‌ప్పి వ‌రుస ఫ్లాపుల‌ను మూట గ‌ట్టుకున్నారు.

సుంద‌ర‌కాండ‌తో స‌క్సెస్ అందుకున్న రోహిత్

దీంతో చాలా కాలంగా నారా వార‌బ్బాయి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రోహిత్ కోరిక ఇన్నాళ్ల‌కు తీరింది. చాలా కాలం త‌ర్వాత రోహిత్ న‌టించిన సుంద‌ర‌కాండ అనే సినిమాకు ఆడియ‌న్స్ నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. దీంతో స‌క్సెస్ ఇచ్చిన జోష్ లో నారా రోహిత్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటూ తెలుగు రాష్ట్రాల్లోని న‌గ‌రాల‌ను చుట్టేస్తున్నారు.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రీసెంట్ గా గుంటూరు వెళ్లిన రోహిత్, అక్క‌డి గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుని అనంత‌రం అభిమానుల‌తో, మీడియాతో మాట్లాడి ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. చాలా రోజుల త‌ర్వాత సుంద‌ర‌కాండ అనే సినిమాతో ఆడియ‌న్స్ ను మెప్పించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చే పాజిటివ్ టాక్ ఎంతో ఆనందాన్నిస్తోంద‌న్నారు.

త్వ‌ర‌లోనే నారా రోహిత్ పెళ్లి

సుంద‌ర‌కాండ మెయిన్ టార్గెట్ యూత్, ఫ్యామిలీలే అని, త‌న త‌ర్వాతి సినిమాలు డిఫ‌రెంట్ గా అంద‌రినీ టార్గెట్ చేసేలా ఉంటాయ‌ని, త్వ‌ర‌లోనే నెక్ట్స్ మూవీస్ గురించి అనౌన్స్ చేస్తాన‌న్నారు. ఇదే సంద‌ర్భంగా త‌న పెళ్లి విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు రోహిత్. అక్టోబ‌ర్ లాస్ట్ వీక్ లేదా న‌వంబ‌ర్ స్టార్టింగ్ లో త‌న పెళ్లి ఉంటుంద‌ని రోహిత్ చెప్పారు. ఆల్రెడీ ప్ర‌తినిధి2 సినిమాలో హీరోయిన్ గా న‌టించిన శిరీష‌(సిరి)తో రోహిత్ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ్గా, పెళ్లి అనుకుంటున్న టైమ్ లో రోహిత్ తండ్రి మ‌ర‌ణించ‌డంతో పెళ్లి వాయిదా ప‌డింది.