పెళ్లి వీడియో: మరీ అలా సిగ్గుపడితే ఎలా రోహిత్?
సినీ ప్రముఖులలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో సందడి చేశారు.
By: Sivaji Kontham | 25 Jan 2026 12:08 PM ISTటాలీవుడ్ యువహీరో నారా రోహిత్ - సిరి లెల్ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట వివాహం గత ఏడాది అక్టోబర్ లో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఇప్పుడు ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో అధికారికంగా విడుదలైంది. దీనిలో వధూ వరుల అరుదైన ఎక్స్ ప్రెషన్స్, సంభాషణలతో ప్రీవెడ్డింగ్ వేడుకలను కవర్ చేసిన విధానం ఆకట్టుకుంది. వీడియో ఆద్యంతం ముచ్చటైన జంట అందమైన ఆహార్యంతో అద్భుతమైన లుక్స్ తో ఆకట్టుకున్నారు. ప్రీవెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. నిజానికి పెళ్లికూతురితో సమానంగా సిగ్గు పడుతూ నారా వారబ్బాయి అందరికీ షాకిచ్చాడు.
పెళ్లి వేడుక సమయంలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు నారా రోహిత్ పెదనాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అత్తమ్మ నారా భువనేశ్వరి, బావ నారా లోకేష్, నందమురి బాలకృష్ణ తదితర కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సినీ ప్రముఖులలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో సందడి చేశారు. అప్పట్లో బయటకు వచ్చిన లీక్డ్ వీడియోలో చంద్రబాబు నాయుడు - బాలకృష్ణ ఒకే ఫ్రేమ్‌లో ఉండి నూతన దంపతులతో ఫోటోలు దిగడం హైలైట్‌గా నిలిచింది. పెళ్లిలో సిరి లెల్ల సాంప్రదాయక పట్టుచీరలో మెరిసిపోగా, రోహిత్ సిల్క్ పంచె కట్టులో కనిపించారు.
నారా రోహిత్ - సిరి లెల్ల ప్రేమ కథ ఇంట్రెస్టింగ్. వీరిద్దరూ కలిసి `ప్రతినిధి 2` సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు వెళ్లింది. గత ఏడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నారా రోహిత్ తదుపరి సినీ నటుడిగా కెరీర్ పైనా దృష్టి సారించనున్నారు.
