నారా రోహిత్ బర్తడే స్పెషల్.. అన్ సీన్ ఫోటోలతో భార్య ఎమోషనల్ విషెస్!
ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ తన భర్తకు విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: Madhu Reddy | 25 July 2026 12:19 PM ISTప్రముఖ హీరో నారా రోహిత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా ,నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, దివంగత చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు కొడుకు. అంతేకాదు నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత కూడా.. బాణం సినిమాతో తొలిసారి 2009లో ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్ .. సోలో, సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర , తుంటరి, జో అచ్యుతానంద ఇలా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నారా రోహిత్ బర్తడే స్పెషల్..
2018 వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత సుమారుగా ఆరేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన నారా రోహిత్.. మళ్లీ 2024లో ప్రతినిధి 2 సినిమాతో కం బ్యాక్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత భైరవం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. చివరిగా సుందరకాండ సినిమాతో మెప్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆయన పుట్టినరోజు కావడంతో నారా రోహిత్ భార్య శిరీష లెల్ల ఆయనకు స్పెషల్గా ఎమోషనల్ విషెస్ తెలియజేసింది. అంతేకాదు మునుపెన్నడూ చూడని అన్ సీన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
భర్తకు ఎమోషనల్ విషెస్ చెప్పిన శిరీష లెల్ల..
శిరీష లెల్ల తన భర్త నారా రోహిత్ తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను, వెకేషన్ కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలు అన్నింటిని తాజాగా తన అధికారిక ఖాతా ద్వారా పంచుకుంటూ.. ఆయనకు స్పెషల్గా ఒక ఎమోషనల్ విషెస్ ఆమె తెలియజేసింది." ప్రియమైన నారా రోహిత్.. ప్రతిక్షణం నువ్వు నా పక్కన ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. నా భాగస్వామిగా, నా ప్రాణ స్నేహితుడిగా ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచావు. నా జీవితంలో దొరికిన ఒక గొప్ప వరం నువ్వు. జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా.. ఈ జీవితంలో అలాగే రాబోయే ప్రతి జన్మలో కూడా నీతోనే ఈ ప్రయాణం.. నువ్వు నా భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. ఈ ప్రయాణానికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ తన భర్తకు విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శిరీష లెల్లా తో ప్రేమ, పెళ్లి, పిల్లలు..
ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్గా నటించిన శిరీష లెల్ల ప్రేమలో పడ్డ నారా రోహిత్ ..2024 అక్టోబర్ 13న హైదరాబాదులోని హైటెక్స్ నోవాటెల్ లో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ సడన్గా ఆయన తండ్రి పరమపదించడంతో 2025 అక్టోబర్ 30న తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల సమక్షంలో హైదరాబాదులోని అజీజ్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో శిరీష లెల్ల మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ ఏడాది జూన్లో శిరీష లెల్ల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
బర్తడే స్పెషల్.. కొత్త ప్రాజెక్టు ప్రకటించిన నారా రోహిత్..
ఇదిలా ఉండగా మరొకవైపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ గన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. హన్సిక, ప్రణీత పట్నాయక్ , లావణ్య ముఖ్యపాత్రలు పోషిస్తూ ఉండగా.. కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'కపాలి' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే స్పెషల్ పోస్టర్ ను పంచుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
