Begin typing your search above and press return to search.

కొత్త కాంబో.. నారా, అల్లరి సక్సెస్ అందుకుంటారా?

ఇప్పుడు నారా రోహిత్, అల్లరి నరేష్ నటించనున్న మూవీని కంప్లీట్ హిలేరియస్ ఎంటర్టైనర్‌ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   4 Feb 2026 6:19 PM IST
కొత్త కాంబో.. నారా, అల్లరి సక్సెస్ అందుకుంటారా?
X

టాలీవుడ్‌ లో కొత్త కాంబినేషన్లకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలు నారా రోహిత్, అల్లరి నరేష్ కలిసి ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అన్నీ ఫిక్స్ అయ్యాయని.. త్వరలో అనౌన్స్మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది.

నిజానికి.. ఇద్దరూ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాలి. రీసెంట్ గా పలు సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. దీంతో మంచి కథ, బలమైన స్క్రిప్ట్‌ తో ఆడియన్స్ ముందుకు వస్తే కమ్ బ్యాక్ ఇచ్చే మూవీ దక్కుతుందనే ప్లాన్ లో ఇప్పుడు ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

రీసెంట్ గా నారా రోహిత్ లీడ్ రోల్ లో నటించిన సుందరకాండ మూవీతోనే డైరెక్టర్ గా వెంకటేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ సరైన రిజల్ట్ ను మాత్రం అందుకోలేకపోయారు. ఇప్పుడు నారా రోహిత్, అల్లరి నరేష్ నటించనున్న మూవీని కంప్లీట్ హిలేరియస్ ఎంటర్టైనర్‌ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో నారా రోహిత్ ఇప్పటి వరకు సీరియస్, కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంతో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మాస్ జోనర్ లో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ కు కొత్త ఫీల్ రావడం పక్కా అని చెప్పాలి.

కాగా.. సుందరకాండ మూవీ తర్వాత నారా రోహిత్ కొత్త సినిమా సైన్ చేయలేదు. కొంతకాలంగా సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ నిమ్మలపూడి స్టోరీ విని ఓకే చెప్పారట. మరోవైపు అల్లరి నరేష్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇటీవల ఆల్కహాల్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసిన ఆయన.. తన లైనప్ లో ఇప్పటికే ఉన్న పలు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్ కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు!

ఏదేమైనా నారా రోహిత్, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మూవీ అంటే.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న అభిప్రాయం ఇప్పుడు సినీ ప్రియుల్లో కనిపిస్తోంది. సరైన కథ, టైమింగ్ కలిస్తే ఆ కాంబినేషన్ ఇద్దరికీ హిట్ ట్రాక్‌ లోకి తీసుకురావడం ఖాయమని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. నారా - అల్లరి మూవీని నిర్మాత హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరెప్పుడు వస్తుందో చూడాలి.