Begin typing your search above and press return to search.

నారా రోహిత్ పేరు కూడా ఎత్తలేదు.. త్రివిక్రమ్ స్కెచ్చా?

పోస్టర్లలో బొమ్మ కనిపిస్తుంది, అఫీషియల్ ట్రైలర్ కట్ లో గట్టిగానే ఎంట్రీ ఉంటుంది.. కానీ సినిమాకు అత్యంత కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన పేరే వినిపించలేదు.

By:  M Prashanth   |   28 Oct 2026 9:40 AM IST
నారా రోహిత్ పేరు కూడా ఎత్తలేదు.. త్రివిక్రమ్ స్కెచ్చా?
X

పోస్టర్లలో బొమ్మ కనిపిస్తుంది, అఫీషియల్ ట్రైలర్ కట్ లో గట్టిగానే ఎంట్రీ ఉంటుంది.. కానీ సినిమాకు అత్యంత కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన పేరే వినిపించలేదు. 'ఆదర్శ కుటుంబం' వేడుకలో నారా రోహిత్ విషయంలో చిత్ర యూనిట్ పాటించిన వింతైన మౌనం చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. నార్మల్ గా మన దగ్గర పెద్ద సినిమాల్లో క్రేజ్ ఉన్న మరో హీరో లేదా పాపులర్ యాక్టర్ ఉంటే, ప్రమోషన్లలో వాళ్లను విపరీతంగా వాడేసుకుంటారు.

ఫస్ట్ లుక్ నుంచి ఈవెంట్ స్పీచ్ ల దాకా ప్రతి సందర్భాన్నీ క్యాష్ చేసుకోవడానికే చూస్తారు. కానీ శిల్పకళా వేదికపై త్రివిక్రమ్ సుదీర్ఘంగా మాట్లాడినా, వెంకటేష్ తోటి నటీనటులకు పేరుపేరునా థాంక్స్ చెప్పినా.. ఎక్కడా రోహిత్ పేరు కనీసం వినిపించకపోవడం క్యాజువల్ మిస్టేక్ అయితే కాదు. అంతమందిని గుర్తుపెట్టుకున్న వాళ్లు ఒక ముఖ్యమైన యాక్టర్ ను పూర్తిగా స్కిప్ కొట్టడం వెనుక ఏదో లెక్క ఉందనే అనుమానాలు మొదలయ్యాయి.

దీని వెనుక ఒక ప్రధానమైన ఆలోచన త్రివిక్రమ్ మార్క్ క్రియేటివ్ సస్పెన్స్ కావొచ్చు. సినిమాలో రోహిత్ పాత్ర కేవలం వచ్చిపోయే గెస్ట్ రోల్ కాకుండా, సెకండాఫ్ లేదా క్లైమాక్స్ ను మలుపు తిప్పే ఊహించని ట్విస్ట్ అయ్యుండాలి. స్టేజ్ మీద ఆయన గురించి ఒక్క మాట మాట్లాడినా ఆ పాత్ర తీరు బయటపడిపోతుందని, ప్రేక్షకులకు నేరుగా బిగ్ స్క్రీన్ పైనే మైండ్ బ్లాంక్ అయ్యే కిక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయిందనేది ఒక వాదన.

అయితే నాణేనికి మరోవైపు వినిపిస్తున్న టాక్ వేరేలా ఉంది. పరిశ్రమలో ఇలాంటి నిశ్శబ్దం ఎప్పుడూ కేవలం సస్పెన్స్ కోసమే రాదు. స్క్రీన్ స్పేస్, ఎడిటింగ్ లో నిడివి తగ్గించడం, లేదా పోస్టర్లలో ప్రాధాన్యత లాంటి విషయాల్లో వచ్చే అసంతృప్తులు కూడా తెరవెనుక ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రోల్ ప్రాముఖ్యత విషయంలో నటుడికి, మేకర్లకు మధ్య ఏవైనా తేడాలు వస్తే.. ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండటం, అటు యూనిట్ కూడా ఆ ఊసే ఎత్తకపోవడం టాలీవుడ్ లో గతంలోనూ చూశాం.

ఈ సైలెంట్ స్ట్రాటజీ సినిమా బజ్ కు ప్లస్సా మైనస్సా అనేది ఇప్పుడు పెద్ద పాయింట్. ఒక పాత్రను దాచిపెట్టి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాలనుకోవడం మంచి ఆలోచనే అయినా, ఏకంగా పేరే ఎత్తకుండా దాటవేయడం వల్ల లేనిపోని రూమర్లకు ఆస్కారం ఇచ్చినట్లవుతోంది. సోషల్ మీడియా ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తున్న ఈ రోజుల్లో, ఇలాంటి మౌనం సినిమా కంటే వివాదాలకే ఎక్కువ స్పేస్ ఇస్తుంది.

ఒకవేళ తెరపై ఆ పాత్ర నిజంగానే బాంబ్ లా పేలితే ఈ సైలెన్స్ మొత్తం టీమ్ వేసిన పక్కా మాస్టర్ స్ట్రోక్ కింద లెక్కవుతుంది. అలా కాకుండా ఏదైనా చిన్నపాటి విభేదాల వల్లే ఈ గైర్హాజరు జరిగి ఉంటే మాత్రం అది థియేటర్లలో ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ 'ఘోస్టింగ్' వెనుక ఉన్నది గురూజీ దాచిన అసలైన సర్ ప్రైజ్ ఆ, లేక తెరవెనుక నడిచిన ఏదైనా ఇష్యూనా అనేది తేలాలంటే అక్టోబర్ 30 వరకు ఆగాల్సిందే.