చీమ చిట్టుకుమన్నా వినిపిస్తుందట.. నారా రోహిత్ కొత్త అవతారం
రోహిత్ 23వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సౌండ్ ఇంజనీర్ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. చినిమిల్లి మణికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
By: M Prashanth | 25 July 2026 1:18 PM ISTనారా రోహిత్ సినిమా వస్తుందంటే చాలు అందులో ఖచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా రొటీన్ మాస్ మసాలా కథల వెనుక పరిగెత్తకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలనే నమ్ముకుంటూ వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఒక వెరైటీ గ్లింప్స్ ద్వారా ఇచ్చారు.
రోహిత్ 23వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సౌండ్ ఇంజనీర్ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. చినిమిల్లి మణికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. రిలీజ్ చేసిన చిన్న వీడియో గ్లింప్స్ లో అందరినీ ఎట్రాక్ట్ చేసేలా డైలాగ్స్ కట్ చేశారు.
ఈ సినిమాలో రోహిత్ విష్ణు అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రిలీజ్ చేసిన పోస్టర్ ను గమనిస్తే రోహిత్ ప్రశాంతంగా కళ్లు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నట్లు కూర్చున్నాడు. కానీ ఆ పోస్టర్ నిండా రాసి ఉన్న కొటేషన్స్ చూస్తే మాత్రం క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థమవుతుంది. విష్ణు గాడికి పాము చెవులు, చీమ చిట్టుకుమన్నా వినిపిస్తుంది అనే లైన్స్ చూస్తుంటే, హీరోకి వినికిడి శక్తికి సంబంధించిన ఏదో ఒక వింత లక్షణం లేదా సూపర్ పవర్ లాంటిది ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియో గ్లింప్స్ లో కూడా రీల్స్ చూసే యూత్ కి, సీరియల్స్ చూసే ఆంటీలకు, సైలెంట్ గా సిట్టింగ్ వేసే అంకుల్స్ కి, హానీమూన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన కపుల్స్ అందరికీ స్వాగతం చెబుతూ ఈ సౌండ్ ఇంజనీర్ ఎవరో పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకుంటే వాడికి వినిపిస్తుంది అంటూ పోస్టర్ మీద రాసిన కామెంట్స్ సినిమాలోని హిలేరియస్ యాంగిల్ ను హింట్ ఇస్తున్నాయి. దీన్ని బట్టి ఇదొక సిల్లీ కామెడీ ఎంటర్టైనర్ లా కాకుండా కాస్త లాజికల్ గా సాగే థ్రిల్లర్ టచ్ ఉన్న కథ అయ్యే ఛాన్స్ ఉందనిపిస్తోంది.
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం వెతుకుతున్న రోహిత్ కు ఈ కాన్సెప్ట్ బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలను హ్యాండిల్ చేయడంలో ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్టర్ మణికుమార్ ఈ పాయింట్ ను కథగా ఎంత గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు, స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాడు అనే దానిపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. యువన్ లాంటి సెన్సేషనల్ కంపోజర్ తోడవ్వడం వల్ల సౌండ్ పరంగా థియేటర్లలో మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని చెప్పవచ్చు.
ఇక తన బర్త్ డే రోజున ఒక ఫ్రెష్ అవతార్ తో సౌండ్ ఇంజనీర్ గా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ రొటీన్ కథలను పక్కనపెట్టి కొత్త కంటెంట్ నే ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఈ సౌండ్ ఇంజనీర్ వాళ్ళ అటెన్షన్ ను ఏమేరకు గ్రాబ్ చేస్తాడో, థియేటర్లలో ఎలాంటి సౌండ్ చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు రానున్నాయి.
