Begin typing your search above and press return to search.

నారా వారి ఇంట ఘనంగా జరిగిన హల్దీ వేడుక..

నారా రోహిత్ - శిరీష లేళ్ల వివాహం ఈనెల 30న జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే హిందువుల పెళ్లి అంటే పెళ్లికి ముందు ఎన్నో సాంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి.

By:  Madhu Reddy   |   26 Oct 2025 12:44 PM IST
నారా వారి ఇంట ఘనంగా జరిగిన హల్దీ వేడుక..
X

నారా రోహిత్ - శిరీష లేళ్ల వివాహం ఈనెల 30న జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే హిందువుల పెళ్లి అంటే పెళ్లికి ముందు ఎన్నో సాంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. అలా పెళ్లికి ముందు రెండు మూడు రోజుల నుండే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా నారా రోహిత్ ఇంట పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హాల్దీ ఫంక్షన్ వేడుకలని నారా రోహిత్ ఇంట్లో ఘనంగా స్టార్ట్ చేశారు.. నారా రోహిత్ - శిరీష ల హల్దీ వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేతుల మీదుగా స్టార్ట్ చేశారు..

విషయంలోకి వెళితే.. నారా రోహిత్ ఇంట్లో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి చేతుల మీదుగా హాల్దీ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నారా భువనేశ్వరి రోహిత్ కి పసుపు పూసి మరీ హాల్ది వేడుకలను మొదలుపెట్టింది.ఈ హల్దీ ఫంక్షన్ బంధు మిత్రులు, సన్నిహితులు, టాలీవుడ్ లో ఉన్న కొంత మంది ప్రముఖుల మధ్య చాలా అట్టహాసంగా జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్ లో శిరీష,నారా రోహిత్ లు ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నారా రోహిత్ పెళ్లి కార్యక్రమాల గురించి చూసుకుంటే.. ఈయన పెళ్లి కార్యక్రమాలు అక్టోబర్ 25 హల్దీ వేడుకలతో ప్రారంభం అయ్యి.. అక్టోబర్ 26న పెళ్ళికొడుకుని చేయడం.. అక్టోబర్ 28 న మెహందీ ఫంక్షన్,అక్టోబర్ 29న సంగీత్ వేడుకలు నిర్వహించి అక్టోబర్ 30 న రాత్రి 10:35 కు హైదరాబాదులో శిరీష,నారా రోహిత్ ల పెళ్లి ఘనంగా జరగబోతుందట. వీరి పెళ్లి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగబోతున్నట్టు సమాచారం.

నారా రోహిత్ ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాదులోని హైటెక్స్ నోవాటెల్ లో జరిగినప్పటికీ నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు నవంబర్ 16న మరణించడంతో వీరి పెళ్లి వాయిదా పడింది. అలా ఈ ఏడాది అక్టోబర్ 30న నారా రోహిత్ తాను ప్రేమించిన హీరోయిన్ శిరీష లేళ్లని పెళ్లాడబోతున్నారు.

శిరీష నారా రోహిత్ ల మధ్య పరిచయం ప్రతినిధి 2 మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి బంధానికి దారి తీసినట్టు తెలుస్తోంది.

నారా రోహిత్ సినిమాల విషయానికి వస్తే.. బాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత సోలో, ప్రతినిధి, ఒక్కడినే,ప్రతినిధి -2, తుంటరి, అసుర, జ్యో అచ్యుతానంద వంటి సినిమాల్లో నటించారు. ఈ ఏడాది నారా రోహిత్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి భైరవం అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా సుందరకాండ అనే సినిమాతో కూడా మన ముందుకు వచ్చారు.