నారా వారింట మొదలైన పెళ్లి పనులు.. అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్న రోహిత్
నిశ్చితార్థం తర్వాత రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి వాయిదా పడగా, ఇప్పుడు వారి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 22 Oct 2025 2:04 PM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అందరూ మెల్లిగా పెళ్లి పీటలు ఎక్కేసి ఓ ఇంటి వారైపోతున్నారు. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య, అఖిల్, రీసెంట్ గా నార్నే నితిన్ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టగా మరికొందరు ఎంగేజ్‌మెంట్ చేసుకుని నెక్ట్స్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నారా రోహిత్ ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు.
బాణంతో ఎంట్రీ ఇచ్చిన రోహిత్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా బాణం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్, మొదటి సినిమాతోనే మంచి డీసెంట్ హిట్ ను అందుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత సోలో మూవీతో భారీ హిట్ ను అందుకున్న రోహిత్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.
శిరీష తో ప్రేమలో పడ్డ రోహిత్
రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ డిఫరెంట్ ప్రయోగాలు చేసే నారా రోహిత్ రీసెంట్ గా సుందరకాండ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రతినిధి2 సినిమాలో తనతో పాటూ కలిసి నటించిన శిరీషతో ప్రేమలో పడ్డ రోహిత్, తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి, అందులో భాగంగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
అక్టోబర్ 30న రోహిత్- శిరీషల పెళ్లి
నిశ్చితార్థం తర్వాత రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి వాయిదా పడగా, ఇప్పుడు వారి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 30న రోహిత్-శిరీషల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఒక రోజే చేస్తున్నారు కానీ తమ పెళ్లిని తమతో పాటూ అందరూ గుర్తు పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారట రోహిత్. అందులో భాగంగానే ఐదు రోజుల ముందు నుంచే వరుసగా ఈవెంట్స్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.
హాజరుకానున్న పలువురు ప్రముఖులు
అక్టోబర్ 25న తెల్లాపూర్ లోని మండువా కోర్ట్‌యార్డ్ లో హల్దీ వేడుకతో రోహిత్ పెళ్లి వేడుకలు మొదలవనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 26న ఐటీసీ గ్రాండ్ కాకతీయలో పెళ్లి కొడుకు ఫంక్షన్ ను ప్లాన్ చేశారట. తర్వాత అక్టోబర్ 28న మండువా కోర్ట్‌యార్డ్‌లో మెహందీ ఈవెంట్ జరగనుంది. ఇక ఆఖరిగా అజీజ్ నగర్ లోని ది వెన్యూ లో అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10.35 నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ వేడుకలకు ఇరుపక్షాల కుటుంబ సభ్యులతో పాటూ బంధుమిత్రులు, సెలబ్రిటీలు, గెస్టులు హాజరు కానున్నారు.
