నెపోలియన్ రిటర్న్.. పోలీసులకు మళ్ళీ గట్టి పని పడిందోచ్..!
స్టార్ సినిమాలు మాత్రమే కాదు ఈమధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
By: Ramesh Boddu | 26 Oct 2025 2:11 PM ISTస్టార్ సినిమాలు మాత్రమే కాదు ఈమధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ కంటెంట్ ఉంది అంటే చాలు ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు కాబట్టి అదే కాన్సెప్ట్ ని కొనసాగిస్తూ అలా సీక్వెల్స్ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం నెపోలియన్ అనే సినిమా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఆనంద్ రవి నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా నెపోలియన్. నీడ కనిపించట్లేదు అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో మొదలైన ఆ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ని థ్రిల్ చేసింది.
ఆనంద్ రవి మళ్లీ నెపోలియన్ రిటర్న్ అంటూ..
ఇప్పుడు ఆనంద్ రవి మళ్లీ నెపోలియన్ రిటర్న్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. ఈసారి గేదె మిస్సైందంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఈలోగా ఒక పుర్రె ఒక ఇంట్లో కనిపిస్తూ ఇంట్లో వాళ్లను భయపెడుతుంది. ఇంతకీ ఈ గేదె మిస్సింగ్ ఏంటి.. అక్కడ ఇంట్లో ఆ భయకమరైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే నెపోలియన్ 2 చూడాల్సిందే.
ఏదైనా కొత్త కాన్సెప్ట్ దాన్ని ఆడియన్స్ కు ఎంగేజ్ చేస్తూ చెప్పే ప్రయత్నంలో కొందరు సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే 2023 లో నెపోలియన్ పబ్లిక్ లో మంచి కాస్త డిస్కషన్ జరిగేలా చేసింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా నెపోలియన్ రిటర్న్ సినిమా కూడా ఫస్ట్ లుక్ టీజర్ తో సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో ఆనంద్ రవితో పాటుగా ఆటో రాంప్రసాద్, రఘు బాబు, బిగ్ బాస్ దివి వాధ్య ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.
థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా..
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ లో భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఐతే థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. జోనర్ ఏదైనా ఎంచుకున్న స్టోరీని ఆడియన్స్ కి నచ్చేలా చెప్పగలిగే సినిమా సక్సెస్ అయినట్టే. ఐతే కమర్షియల్ గా రెవిన్యూ లెక్కలేసుకోవడం ఒక టైప్ అయితే సినిమా జనాల్లోకి వెళ్తే చాలు ఓటీటీలో అయినా ఆడేస్తుంది అనుకునే టైప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఐతే నెపోలియన్ 2 ఏ కేటగిరికి వెళ్తుంది అన్నది చూడాలి.
ఐతే థ్రిల్లర్ సినిమాలు ఈమధ్య ఎక్కువ వస్తున్న కారణంగా సీట్ ఎడ్జ్ స్క్రీన్ ప్లే ఉంటేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా పైపైన ఉంటే అసలు పట్టించుకోవట్లేదు. నెపోలియన్ టీజర్ ఆసక్తికరంగానే ఉన్నా సినిమా కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.
