Begin typing your search above and press return to search.

'బటర్ ఫ్లై ఎఫెక్ట్' అంటే ఏంటి? నాన్నకు ప్రేమతో మూవీకి ఈ థియరీ ని ఎలా అప్లై చేశాడంటే...

మార్నింగ్ ఆమెకి లేవగానే కాఫీ తాగే అలవాటు ఉందని తెలుసుకొని వాళ్ళింట్లో కరెంట్ కట్ చేస్తాడు. అలాగైతే ఆమె బయటికి వస్తుందని ప్లాన్ చేస్తాడు.

By:  Gopi Velupala   |   2 Oct 2026 6:00 AM IST
బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి? నాన్నకు ప్రేమతో మూవీకి ఈ థియరీ ని ఎలా అప్లై చేశాడంటే...
X

'ఆర్య' సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టిన దర్శకుడు 'సుకుమార్'... మొదటి సినిమాతోనే వైవిద్య భరితమైన కథాంశాలను రూపొందించగలిగే కెపాసిటి తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలతో సైతం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ వచ్చాడు. అతని సినిమాల్లో మనకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ హీరోలకు కొత్త మేకోవర్ ను తీసుకొస్తాడు. అందుకే సుకుమార్ కి పాన్ ఇండియా వైడ్ గా చాలా మంచి క్రేజ్ ఉంది. అలాంటి దర్శకుడి తో పని చేయడానికి ఇండియా వైడ్ గా ఉన్న ప్రతి హీరో ఆసక్తి చూపిస్తుండటం విశేషం... ఇక సుకుమార్ ఎన్టీఆర్ తో చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో 'బటర్ ఫ్లై' ఎఫెక్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి...

బటర్ ఫ్లై ఎఫెక్ట్

ఒక చోట జరగాల్సిన చిన్న సంఘటన సీతాకోక చిలుక తన రెక్కలు ఆడించడం తో ఏర్పడిన గాలి వల్ల అది ఇంకెక్కడో జరగబోయే పెను తుఫాన్ కి కారణమవుతుంది. సుకుమార్ ఈ డైలాగ్ ను సినిమాలో కూడా చెప్పించాడు. అయితే ఈ మూవీ మొత్తం అదే థియరీ ని ఫాలో అవుతూ నడిపించాడు... అందుకే మనకు మేజర్ సీక్వెన్స్ లు జరిగినపుడు సినిమాలో సీతాకోక చిలుక కనిపిస్తుంది. ఎన్టీఆర్ జగపతి బాబు కలిసి మాట్లాడుకుంటుంటే ఒక బటర్ ఫ్లై వచ్చి గ్లాస్ మీద వాలుతుంది. ఎన్టీఆర్ ఆ గ్లాస్ మీద కొట్టగానే ఆ బటర్ ఫ్లై లేచి వెళ్ళిపోతుంది...

మేజర్ సీన్స్ ను ఈ థియరీ కి ఎలా కనెక్ట్ చేశారంటే

బిజినెస్ మేన్ అయిన రమేష్ చంద్ర (రాజేంద్ర ప్రసాద్) తన ఫ్రెండ్ అయిన కృష్ణమూర్తి (జగపతి బాబు) ని బ్లైండ్ గా నమ్ముతాడు. కానీ అవకాశం కోసం ఎదురుచూసిన కృష్ణమూర్తి రమేష్ చంద్ర ను మోసం చేసి బిలియనీర్ అవుతాడు... స్నేహితుడి చేతిలో మోసపోయాననే బాధ తో ఉన్న రమేష్ చంద్ర తీవ్రమైన మనో వేదనను అర్థం చేసుకున్న అతని కొడుకు అభిరామ్ బటర్ ఫ్లై థియరీ ని వాడి కృష్ణమూర్తి మీద పగ తీర్చుకుంటాడు... నిజానికి అభిరామ్ కి కృష్ణమూర్తి ని చంపాలనేంత కోపం ఉన్న ఆయన్ని ఏం చేయడు. డైరెక్ట్ గా అతనితో యుద్ధం కూడా చేయడు. కానీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు...

కాఫీ కింద పడిపోవడం

ట్రాఫిక్ సిగ్నల్ పడటం

దానివల్ల ఒక వ్యక్తి మూడ్ మారడం

ఈ మూడింటి తో ఒక బటర్ ఫ్లై ఎఫెక్ట్ వాడి సినిమాను ముందుకు నడిపించాడు. దీనిని ఎలా ప్రజెంట్ చేశాడంటే

కృష్ణమూర్తి ని కలవాలంటే ముందుగా అతని కూతురు దివ్యాంకా ను ప్రేమలో పడగొట్టాలని అభిరామ్ ప్లాన్ చేస్తాడు... దాంతో డైరెక్ట్ గా ఆమెతో మాట్లాడితే ఆమె సరిగ్గా రెస్పాండ్ కాదనే ఉద్దేశ్యంతో ఇక్కడ బటర్ ఫ్లై ఎఫెక్ట్ ను వాడుతాడు. మార్నింగ్ ఆమెకి లేవగానే కాఫీ తాగే అలవాటు ఉందని తెలుసుకొని వాళ్ళింట్లో కరెంట్ కట్ చేస్తాడు. అలాగైతే ఆమె బయటికి వస్తుందని ప్లాన్ చేస్తాడు. అభిరామ్ అనుకున్నట్టుగానే ఆమె కారు తీసుకొని కాఫీ తాగడానికి కేఫ్ కి బయలుదేరుతుంది. మధ్యలో కొన్ని గొడవల వల్ల ఒక రోడ్ క్లోజ్ అవుతుంది. ఆమె మెయిన్ రోడ్ మీదకి రాగానే ఒక వ్యక్తి చేతిలో ఉన్న కాఫీ కింద పడిపోతుంది. దానివల్ల ఒక 3 సెకండ్లు అక్కడ లేట్ అవుతుంది. దాంతో వెనకాల వస్తున్న దివ్యంకా నెక్స్ట్ సిగ్నల్ లో ఇరుక్కుంటుంది. దాంతో ఆ డిస్టబెన్సెస్ ను తట్టుకోలేని దివ్యాంకా పక్కనే ఉన్న కాఫీ షాప్ లోకి వెళ్తుంది. దివ్యంకా ఇదంతా అనుకోకుండా జరిగిందని అనుకుంటుంది. కానీ ఇదంతా అభిరామ్ ప్లాన్ చేస్తే జరిగిందనే విషయం తనకి తెలియదు. ఇదంతా బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో భాగమే... ఎందుకంటే వాళ్ళింట్లో తాగాల్సిన కాఫీ మిస్ అవ్వడం వల్ల దివ్యంకా కాఫీ షాప్ కి వచ్చింది. అంటే అక్కడెక్కడో జరగాల్సిన పని బటర్ ఫ్లై ఎఫెక్ట్ వల్ల ఇక్కడ జరిగింది... ఇలా మూవీ మొత్తాన్ని బటర్ ఫ్లై ఎఫెక్ట్ తో చెప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు...