సినిమా లేటవుతున్నా.. బజ్ మాత్రం అలాగే..
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
By: M Prashanth | 2 July 2026 11:02 AM ISTనేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీల విషయంలో మార్పులు జరుగుతున్నా.. సినిమాపై ఉన్న బజ్ మాత్రం ఏమాత్రం తగ్గకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక సినిమా పదేపదే వాయిదా పడితే ప్రేక్షకుల్లో ఉన్న బజ్ తగ్గిపోతుంది. కానీ ప్యారడైజ్ విషయంలో మాత్రం అలా లేదు.
మూవీ షూటింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో రిలీజ్ ప్లాన్ మారింది. తాజాగా మరోసారి విడుదల వాయిదా పడొచ్చన్న వార్తలు వినిపిస్తున్నా.. అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. కొత్త రిలీజ్ డేట్ పై మూవీ టీమ్ సరైన సమయంలో అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా సినిమాపై చర్చను మరింత పెంచింది.
జూలై నెలకు వెల్కమ్ చెబుతూ ఆయన షేర్ చేసిన ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. లాంగ్ హెయిర్ లుక్ లో కనిపించిన నాని.. ఎడమ చేతికి బ్యాండేజ్ తో కనిపించడం ఆసక్తిని పెంచింది. అంతేకాదు.. "ఘాయల్ హూ.. ఇస్లియే ఘాతక్ హూ" అనే క్యాప్షన్ యాడ్ చేయడంతో ఆ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. ఆ ఫొటోలు చూసిన అభిమానులు ముందుగా నాని హెల్త్ గురించి ఆందోళన వ్యక్తం చేసినా.. అదే సమయంలో సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతోందంటూ పోస్టులు చేస్తున్నారు.
షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్స్ కోసం గాయపడినా వెనక్కి తగ్గేది లేదని నాని తన పోస్ట్ ద్వారా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. పోస్టర్ వచ్చినా, లుక్ విడుదలైనా, పాట వచ్చినా.. మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆయా షేర్ పాటకు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అందుకే రిలీజ్ ఆలస్యమవుతున్నా ప్రేక్షకుల ఆసక్తి తగ్గడం లేదు.
అదే సమయంలో నాని కెరీర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండడంతో మార్కెట్ బాగా పెరిగింది. ఇటీవల విడుదలైన మూవీలు సూపర్ హిట్స్ అవ్వడంతో ప్యారడైజ్ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు దసరా తర్వాత నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రాజెక్టుపై అందరి దృష్టి నెలకొంది. సినిమా ఎప్పుడు విడుదలైనా.. బెస్ట్ గా తీసుకురావాలన్న ప్లాన్ తో మేకర్స్ ఉన్నారని వినికిడి.
అందుకే తొందరపడకుండా అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలా ప్యారడైజ్ రిలీజ్ ఆలస్యమవుతున్నా.. సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నాని తాజా సోషల్ మీడియా పోస్ట్ కూడా అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు అభిమానులంతా ఎదురుచూస్తున్నది ఒక్కటే.. ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారన్నది.
