Begin typing your search above and press return to search.

నాని- విజయ్ బాండ్‌ కు నో బ్రేక్.. మరోసారి చేతులు కలిపితే..

టాలీవుడ్‌ లో స్టార్ హీరోల మధ్య పోటీ ఎంత ఉన్నా.. పర్సనల్ గా ఫ్రెండ్ షిప్ రిలేషన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటాయని మరోసారి నిరూపించారు నాని, విజయ్ దేవరకొండ.

By:  M Prashanth   |   20 April 2026 6:08 PM IST
నాని- విజయ్ బాండ్‌ కు నో బ్రేక్.. మరోసారి చేతులు కలిపితే..
X

టాలీవుడ్‌ లో స్టార్ హీరోల మధ్య పోటీ ఎంత ఉన్నా.. పర్సనల్ గా ఫ్రెండ్ షిప్ రిలేషన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటాయని మరోసారి నిరూపించారు నాని, విజయ్ దేవరకొండ. అభిమానుల మధ్య తరచుగా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నా, తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని ఆ ఇద్దరూ పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

విజయ్, నాని కలిసి నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ రోజుల్లో తనకు నాని ఎంతో సపోర్ట్ చేశారని విజయ్ దేవరకొండ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఒక అవార్డు వేడుకలో నానిని అన్న అని పిలుస్తానని, ఆయనపై తనకు ప్రత్యేక గౌరవం ఉందని విజయ్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే వివాదాలపై కూడా వీరిద్దరూ స్పందించారు. తామిద్దరం కలిసే ఉన్నామని చెప్పేందుకు ఎవడే సుబ్రహ్మణ్యం విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒకే బైక్‌ పై ఉన్న ఫోటోను షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌ లో నెలకొన్న అనుమానాలకు చెక్ పడింది. ఇటీవల జరిగిన మరో సంఘటన ఆ స్నేహాన్ని మరింత హైలైట్ చేసింది.

మార్చిలో జరిగిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్‌ కు నాని తన భార్య అంజనతో కలిసి హాజరై సందడి చేశారు. ఆ వేడుకలో ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా మెలగడం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ, దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.

ఆ వేడుకలో నాని, విజయ్ ఎంతో క్లోజ్‌ గా కనిపించారు. ఒకరినొకరు హగ్ చేసుకోవడం, చేతులు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుకోవడం, ఫన్ చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు శౌర్యువ్‌ తో కలిసి పిక్స్ దిగుతూ సరదాగా గడిపారు. మొత్తం కార్యక్రమంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

చివర్లో క్లాప్ కొడుతున్న సమయంలో నాని చిరునవ్వుతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఆ విజువల్స్ చూసిన ఇద్దరి ఫ్యాన్స్ ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్ అని, తమ హీరోలు నిజంగా మంచి స్నేహితులేనని కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరోసారి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే.. కలిసి ఇంకో సినిమా చేస్తే సూపర్ అని అంటున్నారు. అది ఫ్యూచర్ లో జరుగుతుందోమో చూడాలి మరి.