నాని, విజయ్ సినిమాల మధ్య పోలిక?
టాలీవుడ్ టాప్ స్టార్ల అభిమానుల మధ్యే కాదు.. మిడ్ రేంజ్ హీరోల అభిమానుల్లోనూ ఫ్యాన్ వార్స్‌కు లోటేమీ లేదు.
By: Garuda Media | 23 Dec 2025 4:09 PM ISTటాలీవుడ్ టాప్ స్టార్ల అభిమానుల మధ్యే కాదు.. మిడ్ రేంజ్ హీరోల అభిమానుల్లోనూ ఫ్యాన్ వార్స్‌కు లోటేమీ లేదు. వైరం ఎలా మొదలైందో ఏమో కానీ.. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య కొంత కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగిపోతున్నాయి. నాని సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో చేసిన ప్రత్యేక పాత్రతోనే విజయ్ పేరు సంపాదించాడు. తర్వాత కూడా విజయ్‌కి నాని బాగా సపోర్ట్ చేశాడు.
ఐతే అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ రేంజి మారిపోయి ఒక దశలో నానిని కూడా బీట్ చేసేశాడు. ఐతే ఆ తర్వాత వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. మరోవైపు నాని నిలకడగా విజయాలు సాధిస్తూ విజయ్‌ని దాటి ముందుకెళ్లాడు. ఆ ఇద్దరు హీరోల మధ్య పర్సనల్‌గా ఏ గొడవలూ లేనట్లే కనిపిస్తుంది కానీ.. వారి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో నిత్యం ఘర్షణ పడుతుంటారు. ఒకరి సినిమాను ఇంకొకరు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటారు.
విజయ్ కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన’ నుంచి టీజర్ లాంచ్ అయిన నేపథ్యంలో మరోసారి రౌడీ ఫ్యాన్స్, నేచురల్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరుగుతోంది. నాని మూవీ ‘ది ప్యారడైజ్’ను విజయ్ అనుకరించే ప్రయత్నం చేశాడని.. దానికి కౌంటర్‌గా ఈ సినిమా చేశాడనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ‘ది ప్యారడైజ్’ లాగే రా అండ్ రస్టిక్‌గా కనిపించింది ‘రౌడీ జనార్ధన’ టీజర్.
ఇక ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌లో ‘లం..కొడుకు కథ’ అనే డైలాగ్ ఎంత సెన్సేషన్ అయిందో తెలిసిందే. ‘రౌడీ జనార్ధన’ టీజర్లో విజయ్ నోట కూడా ‘లం..కొడుకు’ అనే మాట వినిపించడంతో అందరికీ ‘ది ప్యారడైజ్’ గుర్తుకు వచ్చింది. కొందరేమో ‘ది ప్యారడైజ్’ స్టైల్‌ను విజయ్ మూవీ టీం కాపీ కొట్టిందని అంటుంటే.. మరి కొందరేమో నానికి కౌంటర్‌గా ఈ డైలాగ్ పెట్టారని అంటున్నారు. టీజర్లో విజయ్ లుక్, డైలాగ్ డెలివరీని తన ఫ్యాన్స్ కొనియాడుతుంటే.. ఇంకో వర్గం మాత్రం వాటి మీద విమర్శలు గుప్పిస్తోంది.
