Begin typing your search above and press return to search.

2027 టార్గెట్.. నిర్మాతగా ఏకంగా మూడు చిత్రాలతో నాని.. ఏవంటే?

నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై వచ్చే యేడాది మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు.

By:  Madhu Reddy   |   6 Feb 2026 7:00 AM IST
2027 టార్గెట్.. నిర్మాతగా ఏకంగా మూడు చిత్రాలతో నాని.. ఏవంటే?
X

ప్రస్తుత కాలంలో హీరోలు ఒకే విభాగంలో సెటిల్ కాకుండా తమ అభిరుచులను చాటుకుంటూ వివిధ విభాగాలలో పని చేస్తూ దూసుకుపోతున్నారు. అలా హీరోలు ఒకవైపు సింగర్లుగా, దర్శకులుగా, నిర్మాతలుగా మారి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. మరొకవైపు చిన్న సినిమాలను నిర్మిస్తూ ఇటు నిర్మాతగా కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. అంతేకాదు అటు ఆదాయపరంగా కూడా భారీగా ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో మహేష్ బాబు, రామ్ చరణ్, NTR వంటి వారితో పాటు నేచురల్ స్టార్ నాని కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు.

ఒకవైపు హీరోగా భిన్నవిభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకవైపు చిన్న సినిమాలే అయినా కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తూ నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నారు నాని. ఒకవైపు హీరోగా తన సినిమాల షూటింగ్లలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు వచ్చే ఏడాది ఏకంగా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా మూడు చిత్రాలను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధం అయ్యారు. మరి నాని నిర్మాణ సంస్థ ద్వారా వచ్చే ఏడాది రాబోతున్న ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై వచ్చే యేడాది మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అందులో భాగంగానే హిట్ 3 క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ పోషించిన నాని.. ఇప్పుడు హిట్ 4 లో కార్తి లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా ఇందులో నాని కూడా నటిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు కూడా.. అలాగే రామ్ జగదీష్ తో మరో సినిమా చేస్తున్న నాని.. దీప్తి గంట దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ మూవీని కూడా లైన్లో పెట్టారు. ఈ చిత్రాలన్నింటినీ కూడా నాని నిర్మించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ మూడు చిత్రాలు కూడా విడుదల కానున్నట్లు సమాచారం.

నాని నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో హీరోగా నటిస్తున్న నాని.. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. నానికి ఇది 32వ చిత్రం కావడం గమనార్హం. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతోంది. మరి అలా ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ మరింత బిజీగా మారారు నాని.