ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ లాంఛ్.. అక్కడే ఎందుకు?
ఈ సినిమా లోని రెండవ పాటను ఏదైనా ఒక ఈవెంట్ నిర్వహించి విడుదల చేస్తారని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. అనూహ్యంగా రిలీజ్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు.
By: Madhu Reddy | 29 Aug 2026 10:15 AM ISTదసరా లాంటి మాస్, యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత శ్రీకాంత్ ఓదెల, స్టార్ హీరో నాని కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే దసరా మూవీ రిజల్ట్ కారణంగా ఎప్పటికప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అటు ఈ సినిమా నుండి వస్తున్న కంటెంట్ కూడా ప్రేక్షకుడిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఆయా షేర్ సింగిల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేస్తారు అంటూ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడగా.. ఎట్టకేలకు ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాటను రిలీజ్ చేయడంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలయ్యింది.
ది ప్యారడైజ్ నుండి సెకండ్ సింగిల్..
అసలు విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో.. నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా లోని రెండవ పాటను ఏదైనా ఒక ఈవెంట్ నిర్వహించి విడుదల చేస్తారని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. అనూహ్యంగా రిలీజ్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో అనిరుధ్ తన మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ ఆగస్టు 28న నిర్వహించారు..
డల్లాస్ లో లైవ్ లో విడుదల.. అక్కడే ఎందుకు?
ఇందులో తన రెండవ పాట ను జానపదాల నుండి తీసుకున్న ఒక మాస్ ట్రాక్ "యేష నాగుల" అనే పాటను లైవ్ గా విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఇకపోతే ఆగస్టు 28న జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ లో ఈ పాటను అభిమానుల ముందే లైవ్ లో విడుదల చేశారు. ఇకపోతే ఇలా ఈవెంట్ నిర్వహించకుండా విడుదల చేయడంతో నేటిజన్స్ నిర్మాతలకు ఖర్చు తగ్గించే ప్రయత్నం అనిరుధ్ చేశారు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది ఆయన లైవ్ కాన్సర్ట్ కి పాపులారిటీ సంపాదించుకోవడానికి ఇలా చేసి ఉంటారు అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విడుదల..
అయితే ఇప్పుడు ఈ పాటను నేడు అనగా ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇక్కడ స్పెషల్ ఈవెంట్ నిర్వహించకుండా అనిరుధ్ తన మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ లో ఈ పాటను లైవ్ లో విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా కనివిని ఎరుగని రీతిలో ఇలా లైవ్ కాన్సర్ట్ లో సినిమా పాటలను నేరుగా అభిమానుల ముందు విడుదల చేయడం విశేషం అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అటు డల్లాస్ లో విడుదలైన ఈ పాట ప్రేక్షకులను బాగా మెప్పించిందని ఆడియన్స్ చెబుతున్నారు. మరికాసేపట్లో యూట్యూబ్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. జంగి రెడ్డి, ప్రభ ఆలపించారు.
ఆయా షేర్ రేంజ్ లో హిట్టు కొడుతుందా?
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన మొదటి పాట ఆయా షేర్ యూట్యూబ్ లో మంచి స్పందన సొంతం చేసుకుంది. మరి ఈ యేశ నాగుల పాట ఇంకెలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ బాబు, రాఘవ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1980ల నాటి సికింద్రాబాద్ బస్తీల నేపథ్యాన్ని తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హక్కుల కోసం పోరాడే ఒక తెగ చుట్టు సాగే ఈ కథ పీరియడ్ బ్యాక్ డ్రాప్ , మాస్ యాక్షన్ ఎమోషన్ కలగలిపిన మూవీగా రాబోతోంది. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 8 భాషల్లో విడుదల చేయబోతున్నారు.
