ఒరిజినల్ మిస్ కాకుండా ‘యేష నాగుల’కు కొత్త టచ్
నాని ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాట ‘యేష నాగుల’ వచ్చేసింది. తెలంగాణలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఈ పాటను సినిమా కోసం అనిరుధ్ మరో వెర్షన్‌గా తీసుకొచ్చాడు.
By: M Prashanth | 29 Aug 2026 11:22 AM ISTనాని ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాట ‘యేష నాగుల’ వచ్చేసింది. తెలంగాణలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన ఈ పాటను సినిమా కోసం అనిరుధ్ మరో వెర్షన్‌గా తీసుకొచ్చాడు. ఇందులో అసలు పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ పాట పాడిన జంగి రెడ్డినే మళ్లీ పాడించారు. ఆయనతో పాటు ప్రభ ఈ వెర్షన్‌ను ఆలపించారు. పాత పాటలో ఉన్న గుర్తుపట్టే భాగాన్ని అలాగే ఉంచుతూ సినిమా అవసరానికి తగ్గట్టు కొత్త సౌండ్ ఇచ్చారు.
ఒరిజినల్ ‘యేష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల’ పాటను జంగి రెడ్డి, సునీత కలిసి పాడారు. సాహిత్యం కూడా జంగి రెడ్డి అద్దులదే. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ వెర్షన్‌కు కాసర్ల శ్యామ్ కొత్త లైన్స్ జోడించాడు. అంటే మొత్తం పాటను మార్చేయకుండా, తెలిసిన ట్యూన్‌ను పట్టుకుని సినిమా ప్రపంచానికి దగ్గరగా తీసుకొచ్చారు. అనిరుధ్ బీట్స్ మాత్రం పాత వెర్షన్‌తో పోలిస్తే పూర్తిగా వేరే టచ్‌లో ఉన్నాయి.
ఈ సాంగ్ లో కీర్తి సురేష్ తో నాని స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ‘నేను లోకల్’, ‘దసరా’ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. అయితే కీర్తి ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ కాదు. ఈ పాటకే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. డిజిటల్ రిలీజ్‌కు ముందే ఈ పాటను డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో లాంచ్ చేశారు.
నాని కూడా అక్కడికి వెళ్లి స్టేజ్‌పై కనిపించాడు. రెగ్యులర్‌గా పాటను ఆన్‌లైన్‌లో వదిలేయకుండా, వేల మంది ఉన్న కాన్సర్ట్‌లో ముందుగా వినిపించడం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్‌లో హైలెట్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్’ వచ్చింది. శ్రీకాంత్ ఓదెల కూడా ‘దసరా’ తర్వాత మరోసారి లోకల్ ఫ్లేవర్ ను సినిమా పాటల్లో వాడుతున్నాడు.
‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ఇంకా మిగతా పాటలు కూడా రావాల్సి ఉంది. మొదటి రెండు సింగిల్స్‌లోనూ అదిరిపోయే బీట్స్ ఇచ్చిన అనిరుధ్, తర్వాతి పాటల్లో కూడా ఇదే తెలంగాణ సౌండ్‌ను కొనసాగిస్తాడా లేక ఆల్బమ్‌ను మరో జోన్‌కు తీసుకెళ్తాడా అన్నది చూడాలి.
