Begin typing your search above and press return to search.

'యేష నాగుల'.. ఊర మాస్ స్టెప్పులతో నాని, కీర్తి

'యేష నాగుల’ ఒరిజినల్ వెర్షన్ పాడిన అద్దుల జంగి రెడ్డినే ఈసారి కూడా తీసుకున్నారు. ఆయనతో పాటు ప్రభ పాట పాడారు. కాసర్ల శ్యామ్ సినిమా వెర్షన్‌కు సాహిత్యం అందించాడు.

By:  M Prashanth   |   29 Aug 2026 4:12 PM IST
యేష నాగుల.. ఊర మాస్ స్టెప్పులతో నాని, కీర్తి
X

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో సింగిల్ ‘యేష నాగుల’ లిరికల్ వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే ‘ఆయా షేర్’తో ఆల్బమ్ మొదలుపెట్టిన టీమ్, ఇప్పుడు తెలంగాణలో బాగా తెలిసిన ఫోక్ నంబర్‌ను సినిమా కోసం కొత్తగా తీసుకొచ్చింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటలో నానితో పాటు కీర్తి సురేశ్ కనిపించడం కూడా హైలెట్ గా నిలిచింది.

‘యేష నాగుల’ ఒరిజినల్ వెర్షన్ పాడిన అద్దుల జంగి రెడ్డినే ఈసారి కూడా తీసుకున్నారు. ఆయనతో పాటు ప్రభ పాట పాడారు. కాసర్ల శ్యామ్ సినిమా వెర్షన్‌కు సాహిత్యం అందించాడు. అంటే పూర్తిగా కొత్త పాట చేయకుండా, జనాలకు తెలిసిన హుక్‌ను అలాగే ఉంచి దాని చుట్టూ కొత్త బీట్, కొత్త లైన్స్ పెట్టారు. అనిరుధ్ కూడా ఫోక్ టచ్ పోకుండా మాస్ బీట్ వైపు తీసుకెళ్లాడు.

లిరికల్ వీడియోలో నాని, కీర్తి సురేశ్ గెటప్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇద్దరినీ రూరల్ లుక్‌లో చూపించారు. పెద్ద సెటప్, గ్రూప్ డ్యాన్సర్లు, లోకల్ జాతర వాతావరణంతో పాటను తెరకెక్కించారు. ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశాడు. కీర్తి పాట కోసం మాత్రమే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. అందుకే ఆమెను కథలో భాగంగా చూపించారా, లేక పూర్తిగా సాంగ్ వరకే పరిమితం చేశారా అన్నది సినిమా వచ్చిన తర్వాతే తెలుస్తుంది.

ఈ పాటను డిజిటల్‌గా రిలీజ్ చేయడానికి ముందే డల్లాస్‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో వినిపించారు. నాని కూడా అక్కడికి వెళ్లాడు. హైదరాబాద్‌లో రెగ్యులర్ సాంగ్ లాంచ్ చేయకుండా, అమెరికాలో పెద్ద మ్యూజిక్ ఈవెంట్ మధ్యలో పాటను ముందుగా తీసుకొచ్చారు. సెప్టెంబర్ 24 రిలీజ్‌కు ముందు ఓవర్సీస్ ప్రమోషన్‌ను కూడా అదే సమయంలో మొదలుపెట్టినట్టైంది.

‘ఆయా షేర్’ తర్వాత రెండో పాటలో కూడా జంగి రెడ్డి వాయిస్ ఉండటం మరో హైలెట్ పాయింట్. ఒకే ఆల్బమ్‌లో వరుసగా తెలంగాణ ఫోక్ వాయిస్‌ను కొనసాగించడం చూస్తే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా మ్యూజిక్‌కు ఒక ప్రత్యేక లోకల్ టచ్ ఉంచాలని చూస్తున్నట్లు ఉంది. ఇక మిగతా పాటల్లో కూడా ఇదే రూట్ కొనసాగిస్తారా, లేక పూర్తిగా వేరే జోన్‌కు వెళ్తారా అన్నది తర్వాతి సింగిల్స్‌తో తెలుస్తుంది.