Begin typing your search above and press return to search.

టీజర్‌తో హైప్.. పాటలతో రచ్చ.. ఇక ట్రైలర్‌తో బాక్సాఫీస్ షేక్!

తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ ట్రైలర్ వ‌ర్క్స్ ప్రారంభమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By:  Madhu Reddy   |   4 Sept 2026 4:59 PM IST
టీజర్‌తో హైప్.. పాటలతో రచ్చ.. ఇక ట్రైలర్‌తో బాక్సాఫీస్ షేక్!
X

నేచురల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటమే ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ప్రత్యేకమైన హైప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషనల్ ప్లాన్‌ను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ ట్రైలర్ వ‌ర్క్స్ ప్రారంభమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూట్ చేసిన కీలక విజువల్స్, కథలోని మెయిన్ ఎమోషన్స్, నాని క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన మాస్ ఎలిమెంట్స్‌ను కలిపి ట్రైలర్‌ను అత్యంత పవర్‌ఫుల్‌గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల సినిమాల్లో కనిపించే రా అండ్ ఇంటెన్స్ టేకింగ్‌కు తగ్గట్టుగా ట్రైలర్ కట్ ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆడియ‌న్స్ లో ఆసక్తిని పెంచగా, ఫస్ట్ సింగిల్ మంచి బజ్‌ను తీసుకొచ్చింది. ఇటీవల వచ్చిన యేషనాగుల సాంగ్‌తో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి జరుగుతున్న డిస్క‌ష‌న్ చూస్తుంటే, మేకర్స్ ప్రమోషన్స్‌కు సరైన సమయాన్నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే నాని లుక్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్స్ గా మారాయి.

అయితే ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పైనే ఉంది. ప్రస్తుతం ఉన్న హైప్‌కు తగ్గట్టుగా ట్రైలర్ కట్ అయ్యి, రిలీజైన తర్వాత ఆడియ‌న్స్ నుంచి భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ది ప్యారడైజ్ ఓపెనింగ్స్‌ను ఆపడం కష్టమే అన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి టీజర్, సాంగ్స్ తో ఇప్పటికే బలమైన పునాది వేసుకున్న ది ప్యారడైజ్ కు ఇప్పుడు ట్రైలర్ మరో భారీ బూస్ట్ ఇవ్వనుందా? ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా హైప్ ఇంకెంత స్థాయికి చేరుతుందో చూడాలి.