Begin typing your search above and press return to search.

నైజాంలో ప్యారడైజ్ రేట్లు.. ముందే జాగ్రత్త పడితే..

హీరో నాని సినిమా అంటేనే నైజాంలో సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

By:  M Prashanth   |   19 Sept 2026 1:28 PM IST
నైజాంలో ప్యారడైజ్ రేట్లు.. ముందే జాగ్రత్త పడితే..
X

హీరో నాని సినిమా అంటేనే నైజాంలో సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. అదే టికెట్ రేట్ల పెంపు. నైజాం మార్కెట్‌ లో బడా సినిమాలకు రేట్లు పెంచుకునే విషయంలో ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ల నేపథ్యంలో ప్యారడైజ్ కు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.

గతంలో పెద్ద సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ పర్మిషన్ ఇస్తూ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించేది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది ఎక్స్ ట్రా ఇన్కమ్ గా హెల్ప్ అయ్యేది. అయితే ఇటీవల కోర్టు ఆదేశాలు, గవర్నమెంట్ ఆర్డర్లపై వచ్చిన పరిణామాలతో ఆ వ్యవహారం అంత ఈజీగా ఉండటం లేదు. దీంతో కొత్త సినిమాలకు రేట్ల పెంపు విషయంలో నిర్మాతలు ముందు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

అదే సమయంలో ది ప్యారడైజ్ టికెట్ రేట్లపై కూడా రకరకాల ప్రచారాలు వినిపించాయి. ఏకంగా రూ.600 నుంచి రూ.1000 వరకు టికెట్ రేట్లు ఉండబోతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రేంజ్ లో రేట్లు పెంచే ఆలోచన లేదని మూవీ టీమ్ ఇప్పటికే క్లారిటీ చేసినట్లు సమాచారం. మీడియం రేంజ్ పెంపుతో సినిమాను తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం మరోటి.

టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వం పెట్టే కండీషన్స్ ది ప్యారడైజ్ టీమ్ ముందుగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో సినిమా రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చే సమయంలో ప్రజలకు యూజ్ అయ్యే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేయాలని ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి అంశాలపై స్టార్ హీరోలతో అవగాహన వీడియోలు చేయించడం ఇందులో భాగంగా మారింది.

ఇప్పుడు నాని కూడా ఇదే తరహాలో సైబర్ క్రైమ్‌ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేశారు. ముఖ్యంగా ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వీడియోను విడుదల చేయడం వెనుక టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. అంటే రేట్ల పెంపు కోసం చివరి నిమిషంలో హడావుడి చేయకుండా ది ప్యారడైజ్ టీమ్ ముందుగానే అవసరమైన ప్రాసెస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో నైజాంలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వచ్చే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్ రేట్లు, పెంపు ఎంత వరకు ఉంటుందనేది గవర్నమెంట్ జీవోలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం సర్కార్ రూల్స్ తగ్గట్లు స్టెప్స్ వేయడం ఇప్పుడు మేకర్స్ కు కీలకంగా మారింది. మరేం జరుగుతుందో.. రేట్లు ఎంత పెంచుతారో.. తెలియాలంటే వెయిట్ చేయాలి.