ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్.. ఊర మాస్ లుక్ లో విశ్వరూపం చూపించిన నాని!
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'.
By: Madhu Reddy | 6 Aug 2026 6:47 PM ISTనాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి తాజాగా అదిరిపోయే టీజర్ విడుదలైంది. ఇందులో నాని 'జడల్' అనే ఊర మాస్ పాత్రలో నెవర్ బిఫోర్ లుక్‌తో విశ్వరూపం చూపించారు. ప్రచార చిత్రం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద జాతరే జరగబోతోందని అర్థమవుతోంది...
టీజర్ ఎలా ఉంది? రగ్గడ్ అవతార్‌తో పూనకాలు:
విడుదలైన టీజర్ మామూలుగా లేదు. 1980ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో, సమాజంలో అణచివేతకు గురైన వర్గం తమ ఉనికి కోసం చేసే పోరాటానికి నాయకుడిగా నాని కనిపిస్తున్నారు. "ఈ దేశం ఎవరిది? ఈ జాగా ఎవరిది?" అంటూ కత్తులు పట్టుకుని నాని అరిచే అరుపులు మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఇక కండలు తిరిగిన దేహంతో, జడల జుట్టుతో నాని ఇంటెన్స్ అవతార్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
మోహన్ బాబు గ్రేస్.. ఆ 'దృష్టి' డైలాగ్ కేక:
టీజర్‌కి బిగ్గెస్ట్ హైలైట్ మాత్రం ఆ చివర్లో నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్. "ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి.. నల్లి గుట్లోన్ దృష్టి, బెదురు గుట్లోన్ దృష్టి..చెడు చూపులన్నీ పోవాలి అన్నీ దూరం కావాలి… థూ థూ థూ!అంటూ నాని చెప్పిన తీరు ధియేటర్స్ లో పూనకాలు పుట్టించేలా వుంది. ఇక ఆ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి స్టైల్, డైలాగ్ చెప్తే ఎలాంటి బేస్ ఉంటుందో, సేమ్ అదే వైబ్‌తో నాని థియేటర్లలో దద్దరిల్లేలా చేశారు.
తారాగణం.. మోహన్ బాబు స్పెషల్ రోల్:
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఇక డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. వీరితో పాటు సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు మరియు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్యమైన పాత్రలలో మెరవనున్నారు.
అనిరుధ్ మ్యూజిక్ మైండ్ బ్లాంక్:
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. ఆ రగ్గడ్ విజువల్స్, అనిరుధ్ బిజిఎమ్ కలసి అభిమానులకు విజువల్ ట్రీట్‌గా మారాయి. ఇక ఈ సినిమా కోసం తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక ఆల్ టైమ్ మాస్ బ్యాంజర్ మ్యూజిక్ అందిచగా, టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ మరియు షాట్ ఊహించని రీతిలో పీక్స్ లో ఉంటూ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
నానిని ఇంతటి రౌద్ర రూపంలో, పవర్‌ఫుల్ వాయిస్ మోడ్యులేషన్‌తో డైలాగ్స్ చెప్పడం మనం ఎప్పుడూ చూడలేదు. 'జడల్' పాత్రలో ఆయన నటన వేరే లెవెల్‌లో ఉందనడంలో సందేహం లేదు, అలాగే మాస్ సినిమాలో ఇకపై "జడల్ జమానా షురూ" అని చెప్పడం ఖచ్చితంగా నిజం.
సెప్టెంబరు 24న థియేటర్లలో జాతర:
నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మాస్ డైలాగులు, ఇంటెన్స్ యాక్షన్, అద్భుతమైన టెక్నికల్ వేల్యూస్‌తో వస్తున్న 'ది ప్యారడైజ్' థియేటర్లలో కలెక్షన్ల నెత్తురు చిటపటలాడించడం ఖాయంగా కనిపిస్తోంది.
