ది ప్యారడైజ్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యేదప్పుడే!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Jan 2026 2:41 PM ISTనేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆల్రెడీ నాని- శ్రీకాంత్ కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో ది ప్యారడైజ్ పై ముందు నుంచి అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.
రా స్టేట్‌మెంట్ తో పెరిగిన అంచనాలు
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా శ్రీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన రా స్టేట్‌మెంట్ అనే టీజర్‌తోనే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. గ్లింప్స్ తో ది ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఇంకా భారీగా పెరిగాయి. ఆ వీడియోలో నాని లుక్స్, మేకోవర్, డైలాగ్స్, అనిరుధ్ ఇచ్చిన బీజీఎం సినిమాపై క్రేజ్ ను విపరీతంగా పెంచాయి.
ది ప్యారడైజ్ వాయిదా అని వార్తలు
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ది ప్యారడైజ్ మూవీని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ప్రకటించారు. కానీ ఇప్పుడా సినిమా చెప్పిన డేట్ కు రావడం లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ అనుకున్న టైమ్ కు పూర్తి కాకపోవడంతో ది ప్యారడైజ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
నాని బర్త్ డే సందర్భంగా కొత్త టీజర్
తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ సినిమా నుంచి ఫిబ్రవరి 24వ తేదీన ఓ కొత్త వీడియోను హీరో నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వీడియోతో పాటే కొత్త రిలీజ్ డేట్ ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుందని సమాచారం. ఒకవేళ నిజంగానే ది ప్యారడైజ్ రిలీజ్ వాయిదా పడితే అన్నీ చూసుకుని కాస్త లేటైనా మంచి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
