నాని.. ఆ రెండిటి లెక్క వేరే లెవెలా..?
న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నాని ఇప్పటివరకు తీసిన సినిమాలన్నిటి కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్నారు.
By: Ramesh Boddu | 8 Sept 2025 11:00 PM ISTన్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నాని ఇప్పటివరకు తీసిన సినిమాలన్నిటి కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్నారు. నాని కూడా కథ బాగా రావడతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని టాక్. ది ప్యారడైజ్ సినిమా నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు నాని. ప్యారడైజ్ సినిమా 2026 మార్చి ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేశాడు నాని.
స్టైలిష్ యాక్షన్ సినిమా..
ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేస్తాడని టాక్. ఓజీ తర్వాత సుజిత్ నానితో చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. నాని ది ప్యారడైజ్ ఒక లెక్కగా వస్తుంటే దాన్ని మించేలా నాని సుజిత్ సినిమాతో రాబోతున్నాడు. నెక్స్ట్ సమ్మర్ ది ప్యారడైజ్ రిలీజ్ అవ్వడం ఆలస్యం నాని సుజిత్ సినిమా మీద ఫోకస్ చేస్తాడని తెలుస్తుంది. ఐతే నాని కూడా ఈ రెండు సినిమాలతో తన మార్కెట్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.
అందుకే రాబోతున్న రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అనిపిస్తాయట. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ అయితే వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే సినిమా ప్రోమోలతో అర్ధమైంది. ఇక సినిమా వస్తే ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. సినిమాలో నాని జడల్ రోల్ లో దుమ్ము దులిపేస్తాడని టాక్.
నాని ప్లానింగ్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్..
సుజిత్ ఓజీ తర్వాత చేయబోతున్న నాని సినిమా కూడా భారీ స్థాయిలో ఉండబోతుందట. ఈ సినిమా మేజర్ పార్ట్ యూరప్ లో ఉంటుందట. సినిమాలో సౌత్ ఇండియా స్టార్ ఒకరు ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తారని టాక్. మొత్తానికి నాని ప్లానింగ్ మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టైర్ 2 హీరోల్లో నానినే కంటిన్యూగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తప్పకుండా నాని ఈ రెండిటితో కూడా తన మార్క్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. ఐతే నాని నుంచి దసరా సినిమా వస్తేనే సర్ ప్రైజ్ అయిన ఆడియన్స్ ఈసారి ది ప్యారడైజ్ లో ఊర మాస్ సినిమా వస్తుంది.
సుజిత్ సినిమా విషయంలో కూడా యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందట. ఈ సినిమాల అప్డేట్స్ నాని ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి.
