మూడు టీమ్స్.. ఒకే టార్గెట్.. ది ప్యారడైజ్ కోసం భారీ ఆపరేషన్!
ఒక సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు రావడమనేది ప్రతీ ప్రాజెక్టుకూ మామూలే.
By: Sravani Lakshmi Srungarapu | 8 Sept 2026 3:58 PM ISTఒక సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు రావడమనేది ప్రతీ ప్రాజెక్టుకూ మామూలే. కానీ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న వేళ మేకర్స్ ఒక్కో పని పూర్తయ్యే వరకు ఎదురుచూడకుండా, పలు విభాగాలను ఒకేసారి రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీంతో ది ప్యారడైజ్ ఇప్పుడు సాధారణ సినిమా నిర్మాణ ప్రక్రియలో కాకుండా ఓ భారీ మల్టీ లేయర్ ఆపరేషన్‌లోకి ఎంటరైనట్టు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఒకవైపు సినిమాలో బ్యాలెన్స్ షూటింగ్ వర్క్స్ ను వేగంగా పూర్తిచేస్తుండగా, మరోవైపు అనిరుధ్ తన మ్యూజిక్ టీమ్ తో తన బాధ్యతలను ప్రారంభించారు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ టీమ్స్ కూడా తమ పనులను సమాంతరంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాయి. సాధారణంగా షూటింగ్ పూర్తైన తర్వాత ఒక్కో విభాగం తన పనిని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ది ప్యారడైజ్ విషయంలో మాత్రం టైమ్ ను సేవ్ చేయడానికి అన్ని ప్రక్రియలను ఒకేసారి ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్ట్రాటజీ వెనుక మరో భారీ టార్గెట్ కూడా కనిపిస్తోంది. నాని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాను కేవలం తెలుగు మార్కెట్‌కే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే సినిమా టెక్నికల్ వర్క్స్ పూర్తయ్యేలోపే ప్రమోషనల్ స్ట్రాటజీలపై కూడా ఫోకస్ పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక నాని కూడా షూటింగ్ బాధ్యతలు ముగిసిన వెంటనే పూర్తి స్థాయి ప్రమోషనల్ మోడ్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇతర భాషల ఆడియన్స్ కు కూడా సినిమాను రీచ్ చేయడం, నాని మార్కెట్‌ను విస్తరించడం ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ సాధించే అవకాశాలున్నాయనే డిస్కషన్ కూడా కొనసాగుతోంది. అలాంటి టైమ్ లో ది ప్యారడైజ్ సక్సెస్ కేవలం మరో హిట్‌గా మాత్రమే కాకుండా, నాని స్టార్‌డమ్‌కు కొత్త బెంచ్‌మార్క్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి షూటింగ్, మ్యూజిక్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నీ ఒకేసారి ముందుకు కదులుతున్న తీరు చూస్తుంటే.. ది ప్యారడైజ్ కోసం మేకర్స్ చేస్తున్న ప్లానింగ్ ఇప్పుడు అసలు ఫైనల్ ఆపరేషన్‌లోకి ప్రవేశించినట్లే కనిపిస్తోంది. ఈ భారీ ప్రయత్నం నానిని పాన్ ఇండియా స్థాయిలో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు ఆగాల్సిందే.
