ది ప్యారడైజ్ కు అనిరుధ్ అదిరిపోయే ప్రమోషన్.. సెకండ్ సింగిల్ రిలీజ్‌లో కొత్త ట్రెండ్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ ప్రమోషన్స్ ఒక్కో అప్‌డేట్‌తో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 27 Aug 2026 12:09 PM ISTనేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ ప్రమోషన్స్ ఒక్కో అప్‌డేట్‌తో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.‘దసరా లాంటి సక్సెస్‌ఫుల్ మూవతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్న విధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సాధారణంగా సినిమా లోని సాంగ్స్ ను ముందుగా సోషల్ మీడియా లేదా మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిలీజ్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ది ప్యారడైజ్ మూవీ యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించనున్న లైవ్ కాన్సర్ట్‌లో ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ను తొలిసారి ఆడియన్స్ కు వినిపించనున్నారు. ఆగస్టు 28న జరగనున్న ఈ కార్యక్రమంలో అనిరుధ్ స్వయంగా ఈ మాస్ ఫోక్ సాంగ్‌ను లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నారు.
ఈ స్పెషల్ కాన్సర్ట్ కు నాని కూడా హాజరుకానుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ఒకే స్టేజ్‌పై కనిపించనుండటంతో డల్లాస్‌లోని ఫ్యాన్స్ కు ఇది డబుల్ ట్రీట్‌గా మారనుంది. ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్‌కు లైవ్‌లో ఉండే ఎనర్జీ, నాని క్రేజ్ కలిస్తే ఈ సాంగ్ లాంచ్ రెగ్యులర్ ప్రమోషనల్ ఈవెంట్‌ను మించి ఉండే అవకాశముంది. ఆగస్టు 28న కాన్సర్ట్‌లో స్పెషల్ గా వినిపించనున్న ఈ సాంగ్‌ను తర్వాతి రోజు, అంటే ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో మేకర్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై మ్యూజిక్ పరంగా అంచనాలను పెంచింది. దీంతో సెకండ్ సింగిల్ కూడా అదే స్థాయిలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది.
ఇక ది ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకుంది. సెప్టెంబర్ 24న పలు భాషల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ తో పాటు శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ కాంబినేషన్‌పై ఆసక్తి ఉన్న మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ది ప్యారడైజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై హైప్ ను పెంచగా.. ఇప్పుడు డల్లాస్ వేదికగా జరగబోయే సెకండ్ సింగిల్ లాంచ్ ది ప్యారడైజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు మరింత ఊపునిచ్చేలా కనిపిస్తోంది.
