సంపూర్ణేష్ బిర్యాని.. ఫుల్ మీల్స్ పక్కానా..?
బిర్యాని పాత్రలో నిజంగానే ఆడియన్స్ కి దమ్ బిర్యాని తో ఫుల్ మీల్స్ పెట్టేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రయత్నిస్తున్నాడు.
By: Ramesh Boddu | 22 Dec 2025 9:00 PM ISTస్పూఫ్ సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈమధ్య పెద్దగా సినిమాలు చేయని అతను లేటెస్ట్ గా ఒక క్రేజీయెస్ట్ కాంబినేషన్ సినిమాలో అదిరిపోయే ఛాన్స్ అందుకున్నాడు. దసరాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరోసారి న్యాచురల్ స్టార్ నానితోనే చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. నాని, శ్రీకాంత్ ఓదెల దసరాతోనే అదరగొట్టేయగా ఈసారి అంతకుమించి అనిపించేలా ది ప్యారడైజ్ తో వస్తున్నారు.
కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్..
ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా నటిస్తున్నాడు. సినిమాలో అతను బిర్యాని రోల్ లో కనిపించనున్నారు. మామూలుగా అయితే సంపూర్ణేష్ అంటే ఎప్పుడు కామెడీనే ఆశిస్తారు. కానీ ఈసారి సీరియస్ రోల్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడు సంపూర్ణేష్.
బిర్యాని పాత్రలో నిజంగానే ఆడియన్స్ కి దమ్ బిర్యాని తో ఫుల్ మీల్స్ పెట్టేలా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రయత్నిస్తున్నాడు. నాని సినిమాల సెలక్షన్ మాత్రమే కాదు ఆ కథకు తగిన పాత్రల ఎంపికలో కూడా ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తాడు. సంపూర్ణేష్ కి తగిన పాత్రతో పాటు ఈమధ్య అతను కెరీర్ పరంగా వెనకపడ్డాడు కాబట్టి ఈ సినిమా అతనికి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.
బిర్యాని ఫస్ట్ లుక్ తో సంపూర్ణేష్..
ఐతే ఇన్నాళ్లు సంపూర్ణేష్ ని కామెడీ రోల్స్ లో చూసిన ఆడియన్స్ కి అతనిలోని రియల్ ఇంటెన్స్ ఏంటన్నది చూపించేలా ది ప్యారడైజ్ ప్రయత్నమని తెలుస్తుంది. సినిమాలో బిర్యాని ఫస్ట్ లుక్ తో సంపూర్ణేష్ రక్తపు మరకలతో కత్తి పట్టుకుని ఉన్న పిక్ చూస్తేనే ఇది సంపూర్ణేష్ సెకండ్ ఇన్నింగ్స్ అనేలా ఉంది. ఇక సినిమాలో మెయిన్ విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన విలనిజం కూడా ది ప్యారడైజ్ కి ప్లస్ అయ్యేలా ఉంది.
నాని ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ గా కయదు లోహార్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ఇలాంటి డిఫరెంట్ సినిమాలో తీసుకోవడం వెనక మేకర్స్ ప్లాన్ ఏంటన్నది సినిమా చూశాక తెలుస్తుంది. నాని మాత్రం ది ప్యారడైజ్ లో జడల్ రోల్ లో నెక్స్ట్ లెవెల్ మాస్ అప్పీల్ తో వస్తున్నాడు.
టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని ది ప్యారడైజ్ మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మొన్నామధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ ఇయర్ అవార్డులన్నీ మా సినిమాకే అని చాలా బలంగా చెప్పాడు. మరి నాని చెప్పినట్టుగా ది ప్యారడైజ్ ఎలాంటి బ్లాస్ట్ తో వస్తుందో చూడాలి.
