Begin typing your search above and press return to search.

నాని కోసం మళ్లీ భారీ సెటప్..!

హీరోగా డైరెక్టర్ గా చేస్తూనే తెలుగులో విలన్ గా రాణిస్తున్నారు పృధ్విరాజ్. ఆల్రెడీ సలార్ 1 లో చేశాడు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో ప్రతినాయకుడిగా చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   27 Sept 2025 7:12 PM IST
నాని కోసం మళ్లీ భారీ సెటప్..!
X

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా భారీ ప్లానింగ్ తో వస్తుంది. ఈ సినిమా విషయంలో న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల ఈసారి కూడా నాని కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ది ప్యారడైజ్ సినిమా అంతా ఒక కొత్త వరల్డ్ లో జరుగుతున్నట్టు ఉంటుందట. నాని క్యారెక్టరైజేషన్ ఐతే నెక్స్ట్ లెవెల్ అని టాక్. ఐతే ఈ సినిమా 2026 మార్చి 26 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

పాన్ వరల్డ్ విలన్..

నాని సుజిత్ ఈ కాంబోలో ఒక క్రేజీ యాక్షన్ మూవీ రాబోతుంది. బ్లడీ రోమియో టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఐతే ఈ సినిమాకు సంబందించిన ఒక లీక్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. నాని కోసం సుజిత్ భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నాడు. అంటే నానికి విలన్ గా పాన్ వరల్డ్ విలన్ నే సెట్ చేస్తున్నాడట. ఎవరతను అంటే అతనే మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ అని అంటున్నారు.

హీరోగా డైరెక్టర్ గా చేస్తూనే తెలుగులో విలన్ గా రాణిస్తున్నారు పృధ్విరాజ్. ఆల్రెడీ సలార్ 1 లో చేశాడు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో ప్రతినాయకుడిగా చేస్తున్నారు. ఇప్పుడు సుజిత్ నాని సినిమాలో కూడా విలన్ గా చేయబోతున్నారట. అసలైతే రాజమౌళి సినిమాలో విలన్ గా చేస్తే ఆయన్ను కూడా హీరో మాదిరిగానే మరో రెండేళ్ల పాటు మరో సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడు. మరి పృధ్విరాజ్ కి ఏమైనా పర్మిషన్ ఇచ్చారేమో కానీ నాని, సుజిత్ కాంబో సినిమాలో పృధ్విరాజ్ విలన్ అని గట్టిగా చెబుతున్నారు.

బ్లడీ రోమియోలో పృధ్విరాజ్..

పృధ్విరాజ్ కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తున్నాడు. నాని తో ఢీ అంటే అది కేవలం కమర్షియల్ గానే కాదు కంటెంట్ పరంగా విలనిజం డిఫరెంట్ గా ఉంటుంది. సో పృధ్విరాజ్ కి బ్లడీ రోమియోలో మంచి రోల్ దొరికినట్టే అని చెప్పొచ్చు. సో నాని, సుజిత్ ప్లానింగ్ చూస్తుంటే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి క్రేజీగా అనిపిస్తుంది.

నాని ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవ్వగానే సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేశాడు సుజిత్. ఫ్యాన్స్ కి ఆ సినిమా ఒక ఫీస్ట్ గా ఇచ్చాడు. సో సుజిత్ పై నాని కూడా సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పొచ్చు.