Begin typing your search above and press return to search.

నాని పారడైజ్ రిలీజ్ కి ప్లాన్ ఏ ప్లాన్ బీ?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ భారీ చిత్రం `ది పారడైజ్` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   8 Sept 2026 4:00 PM IST
నాని పారడైజ్ రిలీజ్ కి ప్లాన్ ఏ ప్లాన్ బీ?
X

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ భారీ చిత్రం `ది పారడైజ్` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ప్యార‌డేజ్ పై కాక మామూలుగా లేదు. పైగా ఇద్ద‌రు `ద‌స‌రా` త‌ర్వాత చేస్తోన్న ప్రాజెక్ట్ కావ‌డంతో? అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్రబృందం రెండు రకాల వ్యూహాలను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్లాన్ ఏ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఒకవేళ ప్లాన్ ఏ వర్కవుట్ అయి సెప్టెంబర్ 24 పారడైజ్ విడుదలయితే దానికి అనుగుణంగా ఇతర సినిమాల విడుదల తేదీల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.

విక్టరీ వెంకటేష్ న‌టిస్తోన్న `ఆదర్శ కుటుంబం` చిత్రం అక్టోబర్ 2న రావాల్సి ఉండగా బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకు వారం ఆలస్యంగా అక్టోబర్ 9కి వాయిదా పడే అవకాశం ఉంది. ఒక‌వేళ‌ సాంకేతిక కారణాలు లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల అనుకున్న సమయానికి ప్యార‌డైజ్ సిద్ధం కాకపోతే ప్లాన్ బీ ని అమలు చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్లాన్ బీ ప్రకారం `ది పారడైజ్` చిత్రాన్ని వాయిదా వేసి గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 1న విడుదల చేస్తారు. ఈ వ్యూహం అమలులోకి వస్తే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరాటం నెలకొంటుంది.

ఒకవేళ ప్లాన్ B అమలులోకి వచ్చి అక్టోబర్ 1న `ది పారడైజ్` థియేటర్లలోకి వస్తే మరుసటి రోజే అక్టోబర్ 2న వెంకటేష్ చిత్రం `ఆదర్శ కుటుంబం` కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దసరా పండుగ రేసులో నాని, వెంకటేష్‌ చిత్రాల మధ్య బాక్సాఫీస్ సమరం నెలకొనడం ఖాయంగా చెప్పొచ్చు. పెద్ద పండుగ సీజన్ కావడంతో ఈ రెండు చిత్రాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నా? థియేటర్ల కేటాయింపులో పోటీ తప్పదు.

రెండు పెద్ద సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదల కావడం వల్ల ఓపెనింగ్స్ , థియేటర్ల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్యార‌డైజ్ చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ ఏ కే ప్రాధాన్యత ఇస్తోందని స‌మాచారం.

సెప్టెంబర్ 24 నాటికే పనులన్నీ పూర్తి చేయాలనే పట్టుదలతో టీమ్ ప‌నిచ‌నేస్తోందని సమాచారం. అదే జ‌రిగితే రెండు సినిమాలకు తగినంత థియేటర్లు ..సోలో రన్ లభించే అవ‌కాశం ఉంటుంది.