మెడలో కిలోల నగలు.. 'జడల్ జమానా'కు కొత్త విలన్ వచ్చేశాడు..
నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 20 Jun 2026 12:10 AM ISTనేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దసరా వంటి భారీ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆ ప్రాజెక్టు కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే జడల్ జమానా అనే కాన్సెప్ట్ తో విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకుంది.
తాజాగా మూవీ టీమ్ మరో కీలక పాత్రను పరిచయం చేస్తూ కొత్త అప్డేట్ ఇచ్చింది. సినిమాలో ప్రముఖ నటుడు రాఘవ్ జుయల్ పోషిస్తున్న విక్రమ్ మాలిక్ పాత్రను ప్రత్యేక వీడియో ద్వారా పరిచయం చేసింది. ఆ వీడియోలో కనిపించిన ఆయన లుక్, పాత్ర తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెడ నిండా బంగారు నగలు, రఫ్ గెటప్, ఎక్స్ప్రెషన్స్ తో రాఘవ్ జుయల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తోంది.
రోల్ ఇంట్రో వీడియోలో వినిపించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఖాన్దాన్ కా షాన్.. దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్‌కి స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా.. నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా' అనే డైలాగ్స్ పాత్రలోని డామినేషన్ నూ చూపిస్తున్నాయి. ఆ ఒక్క వీడియోతోనే సినిమాలో విక్రమ్ మాలిక్ పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే నాని సినిమాలో జడల్ అనే విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు సికంజా మాలిక్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు సికంజా మాలిక్ కుమారుడిగా విక్రమ్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయల్ ఎంట్రీ ఇవ్వడంతో కథలో మాలిక్ కుటుంబం కీలక పాత్ర పోషించబోతుందనే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా నాని పాత్రకు ప్రధాన ప్రత్యర్థిగా విక్రమ్ మాలిక్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రగ్గడ్ శైలిలో సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా విజువల్స్, క్యారెక్టర్ల డిజైనింగ్, బ్యాక్ డ్రాప్ అన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. దసరాలో తెలంగాణ విలేజ్ ఎన్విరాన్మెంట్ ను స్ట్రాంగ్ గా చూపించిన శ్రీకాంత్, ఈసారి మరింత భారీ స్థాయిలో కథ రాసుకున్న తెలుస్తోంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాను రూపొందిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అనిరుధ్ వర్క్, నాని స్క్రీన్ ప్రెజెన్స్ కాంబోపై ఆసక్తి నెలకొంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గతంలో ఆగస్టు 21న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ, తాజాగా ప్రమోషనల్ వీడియోలో ఆ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
దీంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. ఆగస్టులోనే విడుదలవుతుందా? లేక వాయిదా పడుతుందా? అనే అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా రాఘవ్ జుయల్ విక్రమ్ మాలిక్ రోల్ ఇంట్రడక్షన్ తో ప్యారడైజ్ పై ఆసక్తి మరింత పెరిగింది. నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ మధ్య సాగే పవర్ ఫుల్ పోరాటమే ఆ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.
