ఓజి రిలీజైన వెంటనే యూరోప్‌కు సుజీత్.. ఎందుకంటే?
ఇదిలా ఉంటే నాని ది ప్యారడైజ్ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్ కూడా అయింది.
By: Sravani Lakshmi Srungarapu | 10 Sept 2025 6:00 PM ISTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నాని, మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారారు. మెల్లిగా ఒక్కో సినిమా చేసుకుంటూ ఆడియన్స్ ను మెప్పిస్తూ నేచురల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో అయిపోయారు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరైనా సరే వెనుకాడని పొజిషన్ కు నాని చేరుకున్నారు.
ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సొంత బ్యానర్ ను స్థాపించి దాని ద్వారా కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు నాని. గత కొంత కాలంగా నాని అటు హీరోగానూ, ఇటు నిర్మాతగానూ మంచి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ప్యారడైజ్ పై భారీ అంచనాలు
దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న కావడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ది ప్యారడైజ్ నుంచి రా స్టేట్‌మెంట్ అనే పేరుతో వచ్చిన గ్లింప్స్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో దీని కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ మార్చిలో ది ప్యారడైజ్ రాబోతుండగా ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లోనే నాని బిజీగా ఉన్నారు.
ఆల్రెడీ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసిన సుజిత్
ఇదిలా ఉంటే నాని ది ప్యారడైజ్ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్ కూడా అయింది. ఓజి ఆలస్యం అవకుండా ఉంటే ఈ పాటికే నాని-సుజిత్ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఉండేది కానీ కుదరలేదు. అయితే నాని-సుజిత్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సైలెంట్ గా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓజి రిలీజైన తర్వాత సుజిత్, నాని సినిమా కోసం ఇతర కాస్ట్ మరియు టెక్నీషియన్లనను ఫైనల్ చేయడంతో పాటూ లొకేషన్ల కోసం తన టీమ్ తో కలిసి యూరప్ వెళ్తారని తెలుస్తోంది. ఈ సినిమా నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం కానుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
