Begin typing your search above and press return to search.

ప్యారడైజ్: నాని ఫార్ములా మార్చారా? స్కెచ్ అదేనా?

ఇప్పటికే ది ప్యారడైజ్ నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న బజ్‌ ను మరింత పెంచింది. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తుండటంతో అంచనాలు కూడా పెరిగాయి.

By:  M Prashanth   |   6 Sept 2026 12:42 PM IST
ప్యారడైజ్: నాని ఫార్ములా మార్చారా? స్కెచ్ అదేనా?
X

నేచురల్ స్టార్ నాని సినిమాలంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. స్టోరీ, రోల్, యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న ఆయన.. ఇప్పుడు తన రూట్‌ ను మరింత మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ది ప్యారడైజ్ విషయంలో నాని ఎంచుకున్న స్కేల్, స్టోరీ బ్యాక్ డ్రాప్, ప్రమోషన్ ప్లాన్ చూస్తే.. ఈసారి టార్గెట్ కాస్త పెద్దదే అనిపిస్తోంది. ఇంతకీ నాని ఫార్ములా మార్చారా? ది ప్యారడైజ్ తో ఆయన స్కెచ్ ఏంటి?

నాని ఇప్పటివరకు చేసిన సినిమాల్లో వైవిధ్యానికి పెద్దపీట వేశారు. కమర్షియల్ అంశాలతో పాటు కథలో కొత్తదనం ఉండేలా చూసుకున్నారు. అయితే ప్యారడైజ్ మాత్రం ఆయన గత సినిమాలతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో కనిపిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. దసరా తర్వాత వీరిద్దరి కాంబోపై అంచనాలు పెరిగాయి.

ఈసారి నాని కేవలం తెలుగు మార్కెట్‌ ను మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ కు చేరువ చేసేలా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ భాషల ప్రేక్షకులకు సినిమాను పరిచయం చేయడంపై ఫోకస్ పెడుతున్నారు. అంటే.. నాని పాన్ ఇండియా మార్కెట్‌ ను తన కెరీర్‌ లో భాగంగా మార్చుకోవాలని చూస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే ది ప్యారడైజ్ నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న బజ్‌ ను మరింత పెంచింది. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తుండటంతో అంచనాలు కూడా పెరిగాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌ కు అనిరుధ్ మ్యూజిక్ తోడవడం సినిమాకు ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మారింది. దీంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది.

ఇక ప్యారడైజ్ నాని కెరీర్‌ లో మరో కీలకమైన సినిమాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూవీ వర్కౌట్ అయితే నాని మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ తన సినిమాలకు ఓ స్టేబుల్ మార్కెట్ సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడొచ్చు. అయితే పాన్ ఇండియా సినిమా అంటే కేవలం ఇతర భాషల్లో విడుదల చేయడం మాత్రమే కాదు. కథ, రోల్, మేకింగ్, ప్రమోషన్.. అన్నింటినీ ఆ రేంజ్ కు తీసుకెళ్లాలి.

ప్యారడైజ్ విషయంలో నాని ఎంచుకున్న స్కేల్ చూస్తే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా నాని తనకు అలవాటైన స్టోరీ సెలక్షన్ ను వదిలేయకుండా.. దానికి భారీ స్కేల్‌ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ప్యారడైజ్ ను నాని ఫార్ములాలో వచ్చిన ఛేంజ్ గా చూడొచ్చు. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టు మెప్పిస్తే.. ఇకపై నాని సినిమాల మార్కెట్, స్కేల్ రెండూ మరో రేంజ్ కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ప్యారడైజ్ నాని కెరీర్‌ లో ఓ గేమ్ ఛేంజర్‌ గా నిలిచే ఛాన్స్ ఉంది.