Begin typing your search above and press return to search.

ఓటీటీలో ప్లస్ అయినా.. అది మాత్రం పెద్ద మైనస్సే..

థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ను నాని సీరియస్‌గా తీసుకున్నారని, డిజిటల్ రిలీజ్ కు ముందు సినిమాను మరోసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారని సమాచారం.

By:  M Prashanth   |   10 Oct 2026 9:20 AM IST
ఓటీటీలో ప్లస్ అయినా.. అది మాత్రం పెద్ద మైనస్సే..
X

సినిమాకు వచ్చిన కామెంట్స్ ను తగ్గించేందుకు ఓటీటీలో ఛేంజెస్ చేయడం ఒక మంచి ప్రయత్నమే. కానీ థియేటర్లలో రావాల్సిన సక్సెస్ ను, అక్కడ జరిగిన నష్టాలను ఓటీటీ రిలీజ్ వెనక్కి తీసుకురాగలదా అంటే కష్టమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ విషయంలోనూ ఇదే చర్చ నడుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని డిజిటల్ వెర్షన్‌ ను మరింత బెస్ట్ గా రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

నాని సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అందులోనూ ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎడిటింగ్, కొన్ని సీన్స్ వంటి విషయాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ లో ఛేంజెస్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ను నాని సీరియస్‌గా తీసుకున్నారని, డిజిటల్ రిలీజ్ కు ముందు సినిమాను మరోసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారని సమాచారం. థియేటర్లలో చూపించని ఒక పాటతో పాటు మిస్సయిన కొన్ని సన్నివేశాలు కూడా ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఛేంజెస్ తో స్టోరీ మరింత క్లియర్ గా మారుతుందా, ప్రేక్షకులకు సినిమా కొత్తగా అనిపిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓటీటీ వెర్షన్ బాగుంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం కొంత మారే అవకాశం ఉంటుంది. థియేటర్లలో నచ్చని అంశాలు డిజిటల్ రిలీజ్ లో మంచిగా కనిపిస్తే, సినిమా గురించి మళ్లీ పాజిటివ్ డిబేట్ మొదలవ్వచ్చు. ఇది నాని నటుడిగా, మూవీ టీమ్ కు కొంత రిలీఫ్ ఇచ్చే విషయమే. ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయాలు పట్టించుకుని ఛేంజ్ చేయడం ద్వారా సినిమాపై ఉన్న నెగెటివ్ టాక్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది.

కానీ అసలు సమస్య అది కాదు. థియేటర్లలో సినిమా విడుదలైనప్పుడు టికెట్లు కొనుక్కుని చూసే ప్రేక్షకులే బాక్సాఫీస్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తారు. సినిమా అంచనాలకు తగ్గట్టు ఆడకపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల లెక్కలు మారిపోతాయి. ఓటీటీలో సినిమా బాగుందని పేరు వచ్చినా, థియేటర్లలో ఇప్పటికే జరిగిన నష్టాలు ఆటోమేటిక్‌ గా భర్తీ కావు. డిజిటల్ హక్కుల ద్వారా వచ్చిన ఇన్కమ్ వేరు.. థియేటర్లలో వచ్చిన వసూళ్లు వేరు.

అంతేకాదు, ఒక మూవీ థియేటర్లలో అనుకున్న రిజల్ట్ అందుకోకపోతే హీరో, దర్శకుడి నెక్స్ట్ సినిమాలపై కూడా దాని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. తర్వాతి సినిమాల రైట్స్ విషయంలో బయ్యర్లు జాగ్రత్త పడవచ్చు. అందుకే థియేటర్లలోనే మంచి రెస్పాన్స్ రావడం అవసరం. నాని ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలు సినిమాకు మరో ఛాన్స్ ఇవ్వొచ్చు. కానీ ఆ ఛేంజెస్ ముందే జరిగి ఉంటే థియేటర్లలోనూ ప్రేక్షకుల రెస్పాన్స్ బెస్ట్ గా ఉండేదని చెప్పాలి. అందుకే ఓటీటీలో ప్లస్ అయినా.. థియేటర్లలో మాత్రం మైనస్ అలాగే ఉండిపోయింది.