Begin typing your search above and press return to search.

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ను అంత గొప్పగా చూస్తారు.. 'ఫౌజీ'పై మైత్రి ర‌విశంక‌ర్ కామెంట్!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   21 Sept 2026 9:58 PM IST
బాహుబలి తర్వాత ప్రభాస్‌ను అంత గొప్పగా చూస్తారు.. ఫౌజీపై మైత్రి ర‌విశంక‌ర్ కామెంట్!
X

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వై. రవిశంకర్ - నవీన్ ఎర్నేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాపై వారు ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించబోయే రికార్డుల గురించి మాట్లాడారు.

నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెలల ప్రయాణం చిత్ర పరిశ్రమలోని అందరికీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిందని రవిశంకర్ తెలిపారు. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెబుతూ.. కేవలం నైజాం ప్రాంతంలోనే ఈ సినిమా రూ. 50 కోట్ల రేంజ్ వసూళ్లను సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. హీరోకి, డైరెక్టర్‌కి మధ్య ఉండే అండర్‌స్టాండింగ్‌తోనే ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయని కొనియాడారు.

ఈ ఈవెంట్‌లోనే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న `ఫౌజీ` సినిమాపై కూడా మైత్రి నిర్మాతలు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. `ఫౌజి` సినిమా షూటింగ్ కొంచెం వెనక్కి వెళ్లినప్పటికీ.. అది మాత్రం వేరే లెవల్ సినిమా అవుతుందని స్పష్టం చేశారు. `బాహుబలి` తర్వాత ప్రభాస్‌ను అంత గొప్పగా, సరికొత్తగా ఈ చిత్రంలో చూస్తారని.. మళ్లీ ఆ రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే సినిమా అవుతుందని రవిశంకర్ వెల్లడించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని జీవితాకాలం గుర్తుపెట్టుకుంటారని తెలిపారు.

ఇదే వేదికపై మరో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ..ప్యార‌డైజ్ చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మొదటి రోజే డబుల్ ఫిగర్ కలెక్షన్లను రాబట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నాని తన కెరీర్‌లో ఎప్పుడూ మంచి సినిమాలనే ఎంచుకుంటారని ప్రశంసించారు. బాంబే మార్కెట్లో అయితే `నా` అనే అక్షరం వినపడగానే (నాని సినిమా అంటే చాలు) ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయిపోయే రేంజ్ క్రేజ్ ఆయన సొంతం అని కొనియాడారు.

మొత్తానికి `ది ప్యారడైజ్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ ద్వారా మైత్రి నిర్మాతలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఒకవైపు నాని మాస్ యాక్షన్ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ప్రభాస్ `ఫౌజీ` సినిమాపై ఇచ్చిన అప్‌డేట్ అభిమానులలో అంతులేని జోష్ నింపింది. ఈ వేడుక టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చకు దారితీసింది.