నాని రచ్చకి సీట్లు చిరిగిపోయేలా..!
న్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెల తోనే సినిమా చేస్తున్నాడు. ది ప్యారడైజ్ అంటూ మరో సరికొత్త సంచలనానికి రెడీ అవుతున్నాడు నాని.
By: Ramesh Boddu | 18 Aug 2025 3:00 PM ISTన్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెల తోనే సినిమా చేస్తున్నాడు. ది ప్యారడైజ్ అంటూ మరో సరికొత్త సంచలనానికి రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే ఫస్ట్ స్టేట్మెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ చూసి నాని ఫ్యాన్స్ అంతా వారెవా అనేశారు. ఇక నెక్స్ట్ మరో టీజర్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాని రెండు జడలతో కనిపించనున్నాడు.
నాని 3 వేరియేషన్స్ ఉన్న రోల్స్..
ఈమధ్హనే ఆ జడల్ రోల్ ని పరిచయం చేస్తూ నాని సర్ ప్రైజ్ చేశాడు. ఐతే ఈ మూవీలో నాని 3 వేరియేషన్స్ ఉన్న రోల్స్ లో నటిస్తున్నాడట. ఈ 3 వేరియేషన్స్ లో కూడా అదిరిపోతాయని అంటున్నారు. అంతేకాదు నాని ఒక రోల్ లో నెగిటివ్ కూడా అప్పీల్ కూడా ఉంటుందట. కచ్చితంగా ఈ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రతో నాని తన వర్సటాలిటీ చూపిస్తాడట.
ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెలకు ఫుల్ ఫ్రీడం ఇచ్చి సినిమాను తీయమంటున్నాడు. దసరా మేకర్స్ సుధాకర్ చెరుకూరినే ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఐతే నాని ప్యారడైజ్ లో హీరోయిన్ రోల్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ది ప్యారడైజ్ సినిమాలో నాని రోల్ తో నేషనల్ ఆడియన్స్ ని సైతం సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.
పీరియాడికల్ మూవీగా..
నాని సరిపోదా శనివారం తర్వాత ఈ మూవీ వస్తుంది. ది ప్యారడైజ్ సినిమా పీరియాడికల్ మూవీగా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. నాని, శ్రీకాంత్ మరోసారి ఇద్దరు కలిసి వారి మాస్ చూపించబోతున్నారు. నాని మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటు దసరాని మించి నెక్స్ట్ లెవెల్ మాస్ మూవీగా ప్యారడైజ్ వస్తుందని అంటున్నారు. నాని మాత్రం సినిమా మీద ఎన్ని అంచనాలు ఏర్పడినా కూడా దానికి తగినట్టుగా ఉండాలనే కృషి చేస్తున్నాడు.
నాని ప్యారడైజ్ ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా లోని మాస్ వైబ్ ఏంటన్నది చూపించాడు. తప్పకుండా ఫ్యాన్స్ కి ఇదొక మాస్ ఫీస్ట్ అందిస్తే మాత్రం నాని కెరీర్ లో మరింత జోష్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా హిట్ కొట్టి మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు రెడీ అవ్వాలని చూస్తున్నాడు. నాని ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. ఆ టైం లోనే గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది సినిమా కూడా వస్తుంది.
