Begin typing your search above and press return to search.

నాని 'ది ప్యారడైజ్' పోస్టర్‌.. బాక్సాఫీస్‌కు జడల్ హెచ్చరిక

ఈ పోస్టర్‌లో చూపించిన లుక్ రీసెంట్‌గా ఇంటర్నేషనల్ ఫైటర్స్‌తో షూట్ చేసిన ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్‌లోనిది అని మేకర్స్ తెలిపారు.

By:  M Prashanth   |   8 Aug 2025 6:57 PM IST
నాని ది ప్యారడైజ్ పోస్టర్‌.. బాక్సాఫీస్‌కు జడల్ హెచ్చరిక
X

న్యాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ సినిమా కొత్త పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. దసరా తరవాత మళ్లీ ఓ రఫ్, ఇంటెన్స్ క్యారెక్టర్‌తో నాని కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి ఎలాంటి అంచనాలు ఏర్పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫుల్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కి క్రేజ్ రావడంతో మేకర్స్ మరోసారి నాని క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని అసలైన మాస్ లుక్‌తో, వైలెన్స్ మధ్య సింహాసనం తరహాలో చెయిర్‌లో కూర్చుని ఉండటం.. చుట్టూ కరడుగట్టిన బలవంతులు ముట్టుకోలేని విధంగా చుట్టేసిన విధానం రాబోయే యాక్షన్ సీక్వెన్స్‌కి ఊహించని హైప్ తెచ్చింది. నాని క్యారెక్టర్ జడల్ అనే పేరుతో ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ముఖంపై గాయాలు, ఓ రగిలిన రెబెల్ లీడర్ లా కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్‌లో చూపించిన లుక్ రీసెంట్‌గా ఇంటర్నేషనల్ ఫైటర్స్‌తో షూట్ చేసిన ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్‌లోనిది అని మేకర్స్ తెలిపారు. దాదాపు 15 రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగిన ఈ యాక్షన్ సీన్ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని, థియేటర్లలో ఫైరింగ్ యాక్షన్‌ను చూడబోతున్నామంటూ నానీకి మేకర్స్ ఘనంగా అభినందనలు చెబుతున్నారు. ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకుల్లోనూ, నెట్‌లో కామెంట్స్ చేసే ఫ్యాన్స్‌లోనూ సినిమాపై మరింత ఊహలు పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడానికి ముందే ఇదొక హెచ్చరిక లాంటిదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ కోసం నాని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ న్యూ మేకోవర్ తో వచ్చారు. ఎప్పుడూ కూల్ గా కనిపించే హీరో ఇలా రఫ్ లుక్‌లో, యాక్షన్ ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించడం అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను వెంటనే ఆకర్షిస్తోంది. జడల్ క్యారెక్టర్, స్క్రీన్‌ పై డిఫరెంట్ ఎనర్జీ కనిపించబోతోందని ట్రేడ్ సర్కిల్స్ కూడా చెబుతున్నాయి. ఇదే సినిమా ద్వారా నాని మరోసారి మాస్ ట్రెండ్ లో కొత్తగా హైలెట్ కానున్నట్లు అర్ధమవుతుంది.

ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, ‘కిల్’ ఫేమ్ రాఘవ జుయాల్ విలన్ గా కనిపించనున్నాడు. కథలో మరో ప్రత్యేక ఆకర్షణగా ఒకప్పటి కామెడీ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సినిమా 2026 మార్చి 26న పాన్ వరల్డ్ లెవెల్‌లో, ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతోంది. ఇక నాని లుక్స్ చూస్తుంటే ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ తర్వాత సినిమాకు మరో లెవెల్ క్రేజ్ వచ్చేసింది. ఇక జడల్ నాని ఎలా దూకుడుగా కనిపించనున్నాడో తెలియాలంటే మార్చి 26న థియేటర్లలో చూడాల్సిందే.