'ది ప్యారడైజ్' అతి జాగ్రత్త మంచిదే కానీ..?
సరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెలతో దసరా తో సూపర్ హిట్ అందుకున్న నాని ది ప్యారడైజ్ తో మరో అద్భుతాన్ని సృష్టించాలని వస్తున్నాడు.
By: Ramesh Boddu | 17 Oct 2025 7:00 PM ISTసరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెలతో దసరా తో సూపర్ హిట్ అందుకున్న నాని ది ప్యారడైజ్ తో మరో అద్భుతాన్ని సృష్టించాలని వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాని ది ప్యారడైజ్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ మరింత పెంచారు మేకర్స్.
నాని ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఎవరు..
ఇక నాని ఈ సినిమాలో జడల్ రోల్ లో కనిపించనున్నాడు. నాని కెరీర్ లోనే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అసలు ఫ్యాన్స్ కి ఏమాత్రం గెస్ చేయలేని క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కానీ నాని ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు రివీల్ చేయలేదు. దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసింది. ఆమె చుట్టే కథ తిరుగుతుంది కానీ చివరి వరకు అది చెప్పకుండా బాగా హ్యాండిల్ చేశాడు శ్రీకాంత్.
ది ప్యారడైజ్ లో కూడా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంటుందట. ఐతే ఆ రోల్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది. ఐతే సినిమా గురించి జాగ్రత్త వహించడాం మంచిదే కానీ హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అన్న విషయం చెప్పడం వల్ల సినిమాపై బజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మరి ఈ విషయంలో నాని అండ్ టీం ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలియట్లేదు.
శ్రీకాంత్ మీద నమ్మకంగా నాని..
ది ప్యారడైజ్ హీరోయిన్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదా అందుకే ఆమెను లైట్ తీసుకున్నారా అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. ఐతే నాని మాత్రం సినిమా విషయంలోనే కాదు ప్రమోషన్స్ లో కూడా శ్రీకాంత్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకే ది ప్యారడైజ్ అప్డేట్స్ కూడా శ్రీకాంత్ ఎప్పుడు ఇద్దామంటే అప్పుడు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాను శ్రీకాంత్ ఓదెల చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా హిట్టు కొట్టి నెక్స్ట్ మెగాస్టార్ తో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు శ్రీకాంత్ ఓదెల.
శ్రీకాంత్ ప్లానింగ్ బాగుంది కానీ ది ప్యారడైజ్ ప్రమోషన్స్ ఇంకా హీరోయిన్ విషయంలోనే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు ఆడియన్స్. నాని మాత్రం ది ప్యారడైజ్ తో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాను 2026 మార్చి 26న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. నాని ఈ సినిమా తర్వాత సుజీత్ తో బ్లడీ రోమియో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
