Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్ కలెక్షన్ కింగ్ రెమ్యూనరేషన్ ఎంత..?

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   19 Sept 2025 11:08 AM IST
ది ప్యారడైజ్ కలెక్షన్ కింగ్ రెమ్యూనరేషన్ ఎంత..?
X

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా సెట్స్ మీద ఉంది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. S.L.V సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ది ప్యారడైజ్ సినిమాలో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడని టాక్. సినిమాలో ఆయన రోల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందట.

మంచు విష్ణు కన్నప్ప..

ది ప్యారడైజ్ సినిమాలో కలెక్షన్ కింగ్ నటించేందుకు గాను భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట మేకర్స్. మామూలుగా అయితే మోహన్ బాబు ఈమధ్య సినిమాలు తగ్గించేశారు. రీసెంట్ గా మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ఆయన నటించారు. అది సొంత సినిమా కాబట్టి పర్వాలేదు. కానీ ది ప్యారడైజ్ లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారట. సినిమాలో నాని తర్వాత ఈ రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

నాని ది ప్యారడైజ్ లో నటిస్తున్నందుకు మోహన్ బాబుకి ఫ్యాన్సీ అమౌంట్ ని పారితోషికంగా ఇస్తున్నారట. ఒకప్పుడు తన సినిమాలతో కలెక్షన్ కింగ్ గా అదరగొట్టిన మోహన్ బాబు హీరోగా సినిమాలు ఆపేసి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. ఇక ఈమధ్య వాటిని కూడా పూర్తిగా తగ్గించారు. ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. దసరా సినిమా చూసి శ్రీకాంత్ టాలెంట్ మెచ్చిన మోహన్ బాబు ప్యారడైజ్ లో రోల్ అనగానే ఓకే చెప్పారట.

ది ప్యారడైజ్ సినిమాలో కథానాయిక..

మోహన్ బాబు సినిమాలో ఉన్నారని తెలియగానే ప్యారడైజ్ మీద క్రేజ్ డబుల్ అయ్యింది. ఇక ఈ సినిమా నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో చేస్తున్నారట. ది ప్యారడైజ్ నాని కెరీర్ ని కూడా వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని ది ప్యారడైజ్ తో మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ది ప్యారడైజ్ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. హీరోయిన్ విషయంలో చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్. దసరా డైరెక్టర్, హీరో, నిర్మాత కాబట్టి హీరోయిన్ ని కూడా రిపీట్ చేస్తారా లేదా మరెవరైనా తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.