Begin typing your search above and press return to search.

నాని సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి విలనే లేడా?

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో హీరో ఎంత నేచురల్‌ గా కనిపిస్తాడో.. విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటే ఆ స్టోరీకి వచ్చే కిక్కే వేరు.

By:  M Prashanth   |   22 Sept 2026 6:17 PM IST
నాని సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి విలనే లేడా?
X

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో హీరో ఎంత నేచురల్‌ గా కనిపిస్తాడో.. విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటే ఆ స్టోరీకి వచ్చే కిక్కే వేరు. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో చాలామంది గుర్తుండిపోయే విలన్ పాత్రలు ఉన్నాయి. అయితే ది ప్యారడైజ్ లో కనిపించబోయే కలెక్షన్ కిమ్ మోహన్ బాబు రోల్ మాత్రం కొత్తగా కనిపించబోతోందనే చర్చ మొదలైంది.

నాని కెరీర్‌ ను చూస్తే.. ఆయన సినిమాల్లో విలన్ రోల్స్ ఒకే తరహాలో ఉండవు. కొన్ని సినిమాల్లో హీరోకి డైరెక్ట్ గా ఎదురొచ్చే వ్యక్తి ఉంటే.. మరికొన్ని కథల్లో హీరో ఎదుర్కొనే సమస్యే అసలు విలన్ గా మారుతుంది. జెంటిల్‌ మ్యాన్, దసరా, సరిపోదా శనివారం వంటి సినిమాల్లోనూ నాని రోల్స్ కు భిన్నమైన విలన్స్ కనిపించారు. అయితే ప్రతిసారీ విలన్‌ కు ఒక స్పెషల్ ప్లేస్ కనిపించింది. ఇప్పుడు ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే.. మోహన్ బాబు ఇందులో శిఖంజి మాలిక్ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు.

రాఘవ్ జుయెల్ కూడా ముఖ్యమైన పాత్రలో సందడి చేయనున్నారు. అయినప్పటికీ మోహన్ బాబు క్యారెక్టర్‌ పై మొదటి నుంచే ఇంట్రెస్ట్ పెరుగుతోంది. కారణం ఆయన రోల్ స్టోరీలో ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించబోతోందన్నదే. ముఖ్యంగా నానికి ఎదురుగా మోహన్ బాబు కనిపించనుండటంతో.. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై అంచనాలు పెరిగాయి. నాని ఇప్పటివరకు చేసిన సినిమాల్లో హీరోవిలన్ ట్రాక్‌లు ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా ఉన్నాయి. కానీ ఈసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించడంతో.. అందులో మోహన్ బాబు పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మోహన్ బాబు సీనియర్ నటుడు. ఎన్నో సంవత్సరాలుగా విభిన్న పాత్రలు చేసిన ఆయన.. ఒక పాత్రలోకి వెళ్లినప్పుడు తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుడు నాని సినిమాలో విలన్ గా కనిపించనుండటంతో ఆ కాంబినేషన్‌ పై హైప్ ఏర్పడింది. అయితే ప్యారడైజ్ లో మోహన్ బాబు పాత్రను గతంలో ఆయన చేసిన పాత్రలతో పోల్చడం కూడా అంత ఈజీ కాదు.

ఎందుకంటే ఆ సినిమా కథ, వరల్డ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ చెబుతున్నాయి. దీంతో మోహన్ బాబు పాత్ర కూడా ఆ వరల్డ్ కు తగ్గట్టుగానే డిజైన్ అయి ఉంటుందనే చర్చ జరుగుతోంది. నాని సినిమాల్లో విలన్ పాత్రలకు సాధారణంగా హీరోతో ఉండే వార్ మెయిన్ అసెట్. ప్యారడైజ్ లో కూడా అదే కీలకం కానుంది.

అయితే ఈసారి ఆ వార్ ను మోహన్ బాబు తన ఎక్స్పీరియన్స్ తో ఎలా మోస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాని సినిమాల్లో ఇప్పటివరకు చూసిన విలన్ పాత్రలతో పోలిస్తే.. ప్యారడైజ్ లో మోహన్ బాబు క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుందా? ఆయన రోల్ నాని క్యారెక్టర్‌ కు ఎంత స్ట్రాంగ్ సవాల్‌ గా నిలుస్తుంది? అనేది సినిమా విడుదల తర్వాతే పూర్తిగా తెలుస్తుంది.