Begin typing your search above and press return to search.

నవకాంత్ మాస్టర్ మాస్ ప్లాన్… 'ది ప్యారడైజ్' క్లైమాక్స్ యాక్షన్ హైలైట్!

ఈ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కేవలం ఫైట్లతోనే కాకుండా, థియేటర్లలో భీభత్సమైన హైప్ క్రియేట్ చేసేలా ఉంటుందని రీసెంట్ గా సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కూడా హింట్ ఇచ్చారు.

By:  Madhu Reddy   |   16 July 2026 10:00 PM IST
నవకాంత్ మాస్టర్ మాస్ ప్లాన్… ది ప్యారడైజ్ క్లైమాక్స్ యాక్షన్ హైలైట్!
X

నేచురల్ స్టార్ నాని, వైవిధ్యాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, 'జడల్ జాడల్' అంటూ వచ్చిన సాంగ్ తో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా నవకాంత్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీలో రాబోతున్న క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో వుంటాయని టాక్..

రెండు యూనిట్లతో మాసివ్ యాక్షన్ ప్లాన్:

సాధారణంగా ఒక పెద్ద సినిమాకు క్లైమాక్స్ అనేది హార్ట్ లాంటిది. అందునా శ్రీకాంత్ ఓదెల లాంటి ఊరమాస్ డైరెక్టర్ సినిమా అంటే యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో రాబోయే మాసివ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఏకంగా రెండు యూనిట్లను రంగంలోకి దించారు. నవకాంత్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా ఆవిష్కరించేందుకు మాస్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ భారీ ఫైట్ షూట్ పూర్తయితే సినిమా మేజర్ పార్ట్ కంప్లీట్ అయినట్టేనని తెలుస్తోంది.

కాసర్ల శ్యామ్ ఇచ్చిన సాహిత్య ఊపు:

ఈ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కేవలం ఫైట్లతోనే కాకుండా, థియేటర్లలో భీభత్సమైన హైప్ క్రియేట్ చేసేలా ఉంటుందని రీసెంట్ గా సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కూడా హింట్ ఇచ్చారు. ఆయన రాసిన లైన్స్, అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్లైమాక్స్ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయని సమాచారం. ఇక ఈ భారీ యాక్షన్ షూటింగ్ పూర్తయిన వెంటనే, సినిమాలో వచ్చే ఒక క్రేజీ ఐటమ్ సాంగ్ షూట్‌ను కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 25న ప్యారడైజ్ రచ్చ:

షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినప్పటికీ, ఈసారి థియేటర్లలో ఇచ్చే ట్రీట్ మాత్రం మామూలుగా ఉండదని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ విజువల్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో నాని ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించేలా 'ది ప్యారడైజ్' రూపుదిద్దుకుంటోంది. కేవలం కమర్షియల్ ఫైట్లు కాకుండా, కథలో భాగమైన ఎమోషనల్ యాక్షన్‌ను నవకాంత్ మాస్టర్ డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. మరి రెండు యూనిట్లతో రాత్రింబవళ్లు కష్టపడుతూ, అనిరుధ్ మ్యూజిక్ పవర్‌తో వస్తున్న ఈ ప్యారడైజ్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే..