నేచురల్ స్టార్ ని లైన్ లో పెడుతోన్న క్లాసిక్ డైరెక్టర్
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీ ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టు తదుపరి సినిమా ని కూడా నాని సెట్ చేసి పెట్టాడు.
By: Srikanth Kontham | 13 Jan 2026 2:15 PM ISTనేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పట్టిందల్లా బంగారమే అవుతుందన్నట్లు ఉంది సన్నివేశం. `దసరా` నుంచి వరుసగా అన్నీ విజయాలే ఖాతాలో నమోదవుతు న్నాయి. `హాయ్ నాన్న`, `సరిపోదా శనివార`, `హిట్ ది థర్డ్ కేస్` తో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నాడు. దీంతో నాని తదుపరి చిత్రాల లైనప్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. ప్రస్తుతం `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెలతో `ది ప్యారడైజ్` చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నేరుగా పాన్ ఇండియాతో పాటు వరల్డ్ కే కనెక్ట్ చేయాలని ప్లాన్ చేసారు. అదెంత వరకూ సాద్యమవుతుంది? అన్నది చూడాలి.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు భారీ ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టు తదుపరి సినిమా ని కూడా నాని సెట్ చేసి పెట్టాడు. `సాహో`, `ఓజీ`లతో పాన్ ఇండియా డైరెక్టర్ గా వెలిగిపోతుతున్న సుజిత్ ని లైన్ లోకి తీసుకున్నాడు. ఇద్దరు కలిసి `బ్లడీ రోమియో` అంటూ ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. `ది ప్యారడైజ్` తర్వాత పట్టాలెక్కేది ఆ చిత్రమే. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం యంగ్ మేకర్ కిషోర్ తిరుమల నానిని తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే నానికి సుబ్రమణ్యస్వామి నేపథ్యంలో ఓ స్టోరీ నేరేట్ చేసాడు.
కానీ నాని ఒకే చెప్పాడా? లేదా? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఒకవేళ ఈస్టోరీ రిజెక్ట్ చేసినా మరో స్టోరీతో మెప్పించడానికి రెడీగా ఉన్నాడు. `మున్నాభాయ్` అనే సెటైరికల్ స్క్రిప్ట్ ని సిద్దం చేసి పెట్టాడు. ఆస్టోరీతోనైనా నాని లాక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అలాగే నాని ఉన్న బిజీలో డేట్లు ఇస్తాడా? లేదా? అన్న సందేహం కూడా కిషోర్ మాటల్లో కనిపిస్తుంది. నాని డేట్లు ఇస్తే ఈ రెండు కథల్లో ఏదొ ఒకటి తనతో తీస్తానన్నాడు. ఒకవేళ నాని తో కుదరకపోతే మరో హీరోతోనైనా ఇవే కథలు తీసేలా రెడీ అవుతున్నాడు. కిషోర్ తిరుమల కూడా హీరోల ఇమేజ్ ఆధారంగా స్టోరీ సిద్దం చేయడు.
స్టోరీ రాసిన తర్వాత ఆ కథకు ఏ హీరో సెట్ అవుతాడో చూసుకుంటాడు. అతడితో వీలు కాకపోతే మరో హీరోతోనైనా అడ్జస్ట్ అవుతాడని తెలుస్తోంది. ప్రస్తుతం కిషోర్ తిరుమల `భర్తమహాశయులకు విజ్ఞప్తి` అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో రవితేజ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రచారంలో కిషోర్ బిజీగా ఉన్నాడు.
