నాని ది ప్యారడైజ్ హీరోయిన్ ఎవరో తెలిసిందోచ్..!
న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని చేసేందుకు రెడీ అయ్యారు. దసరా తర్వాత నానితో ది ప్యారడైజ్ అంటూ వస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల.
By: Ramesh Boddu | 22 Dec 2025 10:28 AM ISTన్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని చేసేందుకు రెడీ అయ్యారు. దసరా తర్వాత నానితో ది ప్యారడైజ్ అంటూ వస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాను కూడా ఎస్.ఎల్.వి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని ది ప్యారడైజ్ సినిమా లో జడల్ రోల్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు రిలీజైన గ్లింప్స్ లో అతని క్యారెక్టరైజేషన్ కూడా హింట్ ఇచ్చినా ఆడియన్స్ ఏమాత్రం గెస్ చేయలేదు.
విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..
ఇక సినిమాలో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఎంపిక చేశారు. మోహన్ బాబు విలనిజం ఒక రేంజ్ లో ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మోహన్ బాబు కూడా విలన్ గా అదరగొట్టేందుకు రెడీ అయ్యారు. నాని ప్యారడైజ్ మార్చి 26న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఐతే ది ప్యారడైజ్ గురించి అన్ని విషయాలు బయటకు వస్తున్నా సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటివరకు చెప్పలేదు. హీరోయిన్ ని ఎందుకు దాచేస్తున్నారు అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది.
ఐతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నాని ది ప్యారడైజ్ సెట్ లోకి హీరోయిన్ ఎంటర్ అయ్యిందట. ఒక క్రేజీ హీరోయిన్ ని ఈ సినిమా కోసం పిక్ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇంతకీ ఆమె ఎవరు అంటే డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ అని తెలుస్తుంది. ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా కయదు లోహార్ ది ప్యారడైజ్ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యిందట. డ్రాగన్ తో తెలుగులో కూడా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న కయదు లోహార్ ఇప్పటికే విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా చాలా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేశారు.
ఆమెతో సీక్రెట్ గా షూట్..
ఇక నెక్స్ట్ ది ప్యారడైజ్ లో కూడా ఆమెతో సీక్రెట్ గా షూట్ మొదలు పెట్టారట. మొత్తానికి ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఎవరన్న ఇన్ని రోజుల నిరీక్షణకు ఒక ఆన్సర్ దొరికేసింది. నాని కయదు లోహర్ ఈ కాంబినేషన్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ది ప్యారడైజ్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో తమిళ్ లో కయదుకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ప్యారడైజ్ కి తమిళ్ లో మంచి బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది.
నాని ది ప్యారడైజ్ 1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను మాక్సిమం అనుకున్న డేట్ కే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే పోటీగా పెద్ది మార్చి 27న వస్తుంది కాబట్టి నాని ది ప్యారడైజ్ సినిమా వాయిదా ఏమైనా ఉంటుందా లేదంటే చరణ్ పెద్దితో ఫైట్ కి రెడీ అంటారా అన్నది చూడాలి.
