నాని ది ప్యారడైజ్ లో ఫోక్ సాంగ్.. హైప్ పెంచిన కాసర్ల శ్యామ్!
ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ పాట యూట్యూబ్లో చార్ట్ బస్టర్ గా నిలిచి దూసుకుపోతోంది.
By: Madhu Reddy | 18 Aug 2026 1:03 PM ISTనేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తున్న మరో చిత్రం ది ప్యారడైజ్. ఇదివరకే దసర సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నాని.. దసరా సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ది ప్యారడైజ్ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ది ప్యారడైజ్ చిత్రంలో అదిరిపోయే ఫోక్ సాంగ్..
ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ పాట యూట్యూబ్లో చార్ట్ బస్టర్ గా నిలిచి దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే తదుపరి పాట కోసం కూడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సెకండ్ సింగిల్ గా విడుదల అయ్యే ఒక స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది లేదు ఈ సినిమాలో మరో ఫోక్ సాంగ్ ఉండబోతోంది అని.. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ దీనికి బాణీలు అందిస్తున్నారని , ఈ ఐటెం సాంగ్ కోసం ఆయన పక్కా తెలంగాణ ఫోక్ మాస్ బీట్ ను కంపోజ్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అమెరికాలోని టెక్సాస్ లో త్వరలో జరగనున్న తన మ్యూజిక్ కాన్సర్ట్ లో అనిరుధ్ ఈ పాటను నేరుగా లైవ్లో పెర్ఫార్మ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ చేసిన కామెంట్లు అంచనాలను తారస్థాయికి పెంచేసాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కిర్రెక్కించే లిరిక్స్ ఉంటాయంటూ హైప్ ఇచ్చిన కాసర్ల శ్యామ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ తాజాగా మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫోక్ సాంగ్ "ఈశ నాగుల కట్ట మీద " నుంచి ఒక బీట్ వాడారు అనే ప్రచారం సాగుతోంది. ఈ బీట్ కూడా ఉంటుంది. కానీ పాట మొత్తం ఇది కాదు. కిర్రెక్కించే లిరిక్స్ వేరే ఉన్నాయి. నన్ను నమ్మండి ముఖ్యంగా మీరు మరో లెవెల్ వైబ్ ని ఈ సినిమా ద్వారా చూస్తారు అంటూ ఆయన తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించగా.. ఇప్పుడు కాసర్ల శ్యామ్ చేసిన ఆ ఫోక్ సాంగ్ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.
పలు భాషల్లో విడుదల..
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఖయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ,స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
