ది ప్యారడైజ్.. ఇంటర్వెల్‌లో ఊహించని ట్రీట్!
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2026 3:49 PM ISTనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా కథ, నాని లుక్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సినిమాలోని ఒక స్పెషల్ సీన్‌ను అనుకరిస్తారనే కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, విలన్ పాత్రలో కనిపించనున్న రాఘవ్ జుయల్ కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి రాఘవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డిస్కషన్ కు దారితీశాయి. ది ప్యారడైజ్ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆ సీన్ చూసిన తర్వాత ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అదే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ, చేతులు ఫోల్డ్ చేసుకుని బయటకు వస్తారని చెప్పడం విశేషం.
సాధారణంగా భారీ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది కథను మలుపు తిప్పే కీలకమైన ఘట్టంగా ఉంటుంది. కానీ ఒక సీన్ ఆడియన్స్ పై అంతటి ఇంపాక్ట్ చూపించి, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్ని అనుకరించే స్థాయిలో ఉంటుందని రాఘవ్ చెప్పడం ది ప్యారడైజ్ పై కొత్త క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఆ సీన్‌లో నాని క్యారెక్టర్ ఎలా కనిపించబోతుంది? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకునే ఆ మేనరిజం వెనుక ఉన్న సిట్యుయేషన్ ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇప్పటికే ది ప్యారడైజ్ ను మాస్ యాక్షన్ డ్రామాగా భావిస్తున్న ఆడియన్స్ కు ఈ కామెంట్స్ మరో ఇంట్రెస్టింగ్ క్లూ ను ఇచ్చినట్టయ్యింది. ముఖ్యంగా థియేటర్‌లో ఆడియన్స్ రియాక్షన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఎలివేషన్ సీన్ అయి ఉండొచ్చనే అంచనాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విషయంలో అసలు ఆ ఇంటర్వెల్ సీన్ ఏ రేంజ్‌లో పేలుతుందో చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
