Begin typing your search above and press return to search.

నెల రోజులు నాని ఒళ్లు న‌లిగిపోతుందా!

నేచురల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యారడైజ్` షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   4 April 2026 1:09 PM IST
నెల రోజులు నాని ఒళ్లు న‌లిగిపోతుందా!
X

నేచురల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో `ది ప్యారడైజ్` షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. `దసరా` లాంటి మాస్ హిట్ తర్వాత మ‌ళ్లీ అదే కాంబినేష‌న్ లో సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం నాని గతంలో ఎన్నడూ లేని విధంగా తన శరీరాన్ని కష్టపెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ షెడ్యూల్ కోసం ఏకధాటిగా నెల రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో పూర్తిగా భారీ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.

ముఖ్యంగా సినిమా విరామానికి ముందు వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఈ సీన్లు వెండితెరపై ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని కలిగిస్తాయని, నాని కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన ఫైట్స్ అని టాక్ వినిపిస్తోంది. ఈ పోరాట దృశ్యాల కోసం నాని ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుని బ‌రిలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. సాధారణంగా నాని సినిమాలు ఎమోషన్స్ , కథా బలంతో సాగుతాయి. కానీ ది ప్యారడైజ్లో మాత్రం యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండబోతోంది. ఎలాంటి డూప్ సహాయం లేకుండా చాలా వరకు రిస్కీ షాట్స్ నాని స్వయంగా చేస్తున్నారుట‌. ఈ క్రమంలో నాని ఒళ్లు నలిగిపోయేలా శ్రమిస్తున్నారని సెట్స్ నుండి అందుతున్న సమాచారం.

గ‌తంలో `ద‌సరా` సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించిన అనుభవం ఉండ‌టంతో ఈసారి ప‌ని సుల‌భమ‌వుతుంది. శ్రీకాంత్ వ‌ర్కింగ్ స్టైల్ కూడా అల‌వాటైంది కాబ‌ట్టి ప‌ర్వాలేదు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అత్యంత రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిస్తున్నారు. 1990ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్ సన్నివేశాలు చాలా సహజంగా, వయోలెంట్‌గా ఉంటాయని సమాచారం. నాని మేకోవర్ కూడా ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయింది. గడ్డం, జుట్టు పెంచి ఒక ఊర మాస్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు.

ఈ క్యారెక్టర్ కోసం ఆయన పడుతోన్న శ్రమ చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోతోంది. విరామ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆ పదిహేను నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ‌రి నాని తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేస్తోన్న ఈ ప్రయోగం ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోంది. నెల రోజుల పాటు, సాగే ఈ కఠినమైన యాక్షన్ షెడ్యూల్ అనంత‌రం సినిమా తదుపరి దశ పనుల్లోకి వెళ్తుంది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ఎప్పుడూ ముందుండే నాని `ది ప్యారడైజ్` తో మరోసారి తన త్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.