గ్లోబల్ ప్లాన్ లో నాని బిగ్ స్టెప్
'దసరా' సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను పరిచయం చేసిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన టార్గెట్ ను మరింత పెంచేశాడు.
By: M Prashanth | 19 Nov 2025 11:00 PM IST'దసరా' సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను పరిచయం చేసిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన టార్గెట్ ను మరింత పెంచేశాడు. కేవలం పాన్ ఇండియా స్టార్ గా మిగిలిపోకుండా, గ్లోబల్ బాక్సాఫీస్ ను టచ్ చేయాలనే కసి అతనిలో కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' సినిమా కోసం నాని వేస్తున్న ప్లాన్స్ చూస్తుంటే, టాలీవుడ్ నుంచి మరో అంతర్జాతీయ స్థాయి సినిమా రాబోతోందనిపిస్తోంది.
ఈ సినిమాను నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారు. అయితే పెట్టిన బడ్జెట్ వెనక్కి రావాలంటే కేవలం మన మార్కెట్ సరిపోదు. అందుకే సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేయాలని టీమ్ డిసైడ్ అయ్యిందట. కథలో ఉన్న ఎమోషన్, రా యాక్షన్ యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అవుతుందని నాని బలంగా నమ్ముతున్నారు.
దీనికోసం ఒక సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. లోకల్ మీడియాకే పరిమితం కాకుండా, ఇంటర్నేషనల్ మీడియాను, పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారు. వారికి స్పెషల్ గా సినిమాలోని కొన్ని హై ఆక్టేన్ సీన్స్, మేకింగ్ వీడియోలు చూపించి, వెస్ట్ లో బజ్ క్రియేట్ చేయాలనేది ప్లాన్.
అంతేకాదు, ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్ 'రయాన్ రెనాల్డ్స్' పేరును తెరపైకి తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాను గ్లోబల్ గా ప్రెజెంట్ చేయడానికి లేదా ప్రమోషన్స్ లో భాగం చేయడానికి నాని టీమ్ ఆయన్ను సంప్రదించిందట. ఈ డీల్ ఇంకా ఓకే అవ్వకపోయినా, అసలు నాని టీమ్ ఆలోచనలే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది.
రీసెంట్ గా రిలీజైన 'స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్' గ్లింప్స్ చూస్తే ఆ క్వాలిటీ ఏంటో అర్థమవుతుంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. కంటెంట్ లో ఆ దమ్ము ఉంది కాబట్టే, నాని ఇంత పెద్ద రిస్క్ చేయడానికి ధైర్యం చేస్తున్నాడు.
మొత్తానికి 'ది ప్యారడైజ్' ఇప్పుడు కేవలం ఒక తెలుగు సినిమా కాదు, అదొక గ్లోబల్ ప్రాజెక్ట్. మార్చి 26, 2026న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తే, నాని రేంజ్ ఊహించని స్థాయికి వెళ్లడం ఖాయం. మరి ఈ 'గ్లోబల్ స్కెచ్' ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
