ది ప్యారడైజ్ న్యూ లుక్.. నాని నెవ్వర్ బిఫోర్ అనేలా..
ఇప్పుడు నాని కొత్త లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో నాని పొడవాటి జుట్టుతో, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు.
By: M Prashanth | 1 Aug 2025 3:31 PM ISTదసరా విజయంతో నేషనల్ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో మళ్ళీ హైప్ మొదలైంది. వీరిద్దరి కలయికలో మరోసారి రూపొందుతోన్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. నాని కెరీర్‌లో ఇది అతిపెద్ద బడ్జెట్ చిత్రం కావడం, గ్లోబల్ లెవెల్‌లో సినిమాను ప్లాన్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026, మార్చి 26న విడుదల కానుంది.
మేకర్స్ మొదటి నుంచి సినిమాకు సంబంధించి అప్డేట్స్‌ను విడదల చేస్తూ ఫ్యాన్స్ లో పాజిటివ్ హైప్ ను పెంచుతున్నారు. ఇప్పటికే వచ్చిన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, నాని కొత్త లుక్ లీక్ అవడంతో ‘ది ప్యారడైజ్’పై మరింత హైప్ క్రియేట్ అయింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పుడు నాని కొత్త లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో నాని పొడవాటి జుట్టుతో, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు. ‘దసరా’ సినిమాలో చూపిన రఫ్ అండ్ టఫ్ లుక్‌ను మరింత ఇంప్రూవ్ చేసినట్టుగా ఈ లుక్ ఉంది. నాని ఇంత పొడవాటి, మెసివ్ గడ్డంతో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. ఆయన్ను ఇలా చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు అభిమానులు ‘ఇది నాని కెరీర్‌లోనే బెస్ట్ లుక్’ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
నాని ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా స్పెషల్ హైలైట్. లీన్ గా, మసిల్డ్ బాడీతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇందులో నాని పూర్తిగా ఓ రా గ్యాంగ్ స్టర్‌గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లుక్‌కి తగ్గట్టే నానిని ఈ సినిమా కోసం ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ రావడం ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచింది.
ది ప్యారడైజ్ కథ 1980–90ల హైదరాబాదు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహార్, మోహన్ బాబు, రాఘవ జూయల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండటంతో ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్‌గా ఉండటంతో సినిమాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ వచ్చేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
