మార్క్ మై ట్వీట్.. ఒక్క పోస్టుతో హైప్ పెంచేసిన ది ప్యారడైజ్
సినిమా షూటింగ్‌ను డైరెక్ట్ గా చూసిన తర్వాత చేసిన ఆ ట్వీట్‌లో మార్క్ మై ట్వీట్ అనే కామెంట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 1:52 PM ISTనేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయా షేర్ సాంగ్ కు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావడంతో అభిమానులు దానిని మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సినిమా షూటింగ్‌ను డైరెక్ట్ గా చూసిన తర్వాత చేసిన ఆ ట్వీట్‌లో మార్క్ మై ట్వీట్ అనే కామెంట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు యూనిట్ సభ్యులు ఇలాంటి కామెంట్స్ చేయడం అరుదు. అందుకే ఈ ఒక్క కామెంట్‌తోనే సోషల్ మీడియాలో ది ప్యారడైజ్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. క్లైమాక్స్‌లో అసలు ఏముంటుందో, ఎలాంటి ట్విస్ట్ లేదా ఎమోషనల్ హై ఉంటుందో అంటూ ఫ్యాన్స్ తమ తమ అంచనాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఫ్యాన్ పేజీలు, సినీ గ్రూపులు, ఎక్స్ పోస్టుల్లో ఈ అంశంపైనే చర్చ కొనసాగుతోంది.
ఇక నాని కెరీర్ పరంగా చూసినా ఈ సినిమా అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. దసరాతో మాస్ ఇమేజ్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన నాని, అదే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జతకట్టడం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. దసరా సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, పాత్రల తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ది ప్యారడైజ్ ఆ అంచనాలను మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ సినిమా క్లైమాక్స్ నాని కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఘట్టంగా నిలుస్తుందా అనే డిస్కషన్ కూడా సినీ వర్గాల్లో మొదలైంది.
మరోవైపు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల విజన్‌పై కూడా ఇండస్ట్రీలో మంచి నమ్మకం కనిపిస్తోంది. శ్రీకాంత్ కథ చెప్పే విధానం, పాత్రల నిర్మాణం, ఎమోషన్స్ ను స్క్రీన్ పై ప్రెజెంట్ చేసే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. దీంతో ది ప్యారడైజ్ చివరి భాగంలో ఆయన మరోసారి తన మార్క్ చూపించబోతున్నారనే అభిప్రాయం అభిమానుల్లో బలపడుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా క్లైమాక్స్‌ను మరింత ఎఫెక్టివ్ గా మార్చే అంశంగా భావిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఉన్న పాన్ ఇండియా బజ్‌కు ఈ తాజా సోషల్ మీడియా రెస్పాన్స్ మరింత ఊపు తీసుకొచ్చింది. రిలీజ్ కు ఇంకా నెలల టైమ్ ఉన్నప్పటికీ, ఒక్క ట్వీట్‌తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లిన ది ప్యారడైజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో మరింత బలంగా నిలిచింది.
