విజువల్స్ క్లిక్ అయితే.. 'సాయి'కి తిరుగులేనట్లే!
ఏ సినిమాకు అయినా స్టోరీ ఎంత ముఖ్యమో.. ఆ స్టోరీని ఆడియన్స్ కళ్లకు కనిపించేలా చేయడం కూడా అంతే ముఖ్యం.
By: M Prashanth | 23 Sept 2026 8:14 PM ISTఏ సినిమాకు అయినా స్టోరీ ఎంత ముఖ్యమో.. ఆ స్టోరీని ఆడియన్స్ కళ్లకు కనిపించేలా చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ మూవీ విషయంలో ఆ బాధ్యతను సినిమాటోగ్రాఫర్ సాయి తీసుకున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించిన విజువల్స్ చూస్తే.. శ్రీకాంత్ ఓదెల ఊహించిన వరల్డ్ ను సరైన విధంగా చూపించేందుకు సాయి గట్టిగానే వర్క్ చేసినట్లు అర్థమవుతోంది.
సినిమాలోని ఎన్విరాన్మెంట్, రోల్స్ లుక్, యాక్షన్ సీన్స్.. ఇలా ప్రతి ఎలిమెంట్ కు ఒక స్పెషల్ విజువల్ టోన్ కనిపిస్తోంది. అందుకే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో సాయి వర్క్ ను స్పెషల్ గా ప్రశంసిస్తోంది. సినిమా విడుదలకు ముందే కెమెరా వర్క్ గురించి ఇంత చర్చ జరగడం ఆయనకు కలిసొచ్చే విషయమే. నిజానికి.. సాయికి ఇదేం ఫస్ట్ మూవీ కాదు. ఆయన ఇప్పటికే పలు సినిమాలకు వర్క్ చేశారు.
తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో నటించిన ఆ చిత్రంతో కెమెరా డిపార్టమెంట్ లో తన జర్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగులో తత్వ అనే ఇండిపెండెంట్ మూవీకి పనిచేశారు. కానీ పెద్దగా ఆయన పేరు వినిపించలేదు.
ఇప్పుడు ది ప్యారడైజ్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగమయ్యారు. ఒక్కో ప్రాజెక్టుతో తన పనిని చూపించుకుంటూ ముందుకు వస్తున్నా.. ప్యారడైజ్ తో ఆయన నేమ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక సాయి కెరీర్ లో మరో ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర ఆయన కొంతకాలం వర్క్ చేశారు. కెమెరా పనితనంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రత్నవేలు దగ్గర పనిచేయడం సాయికి మంచి ఎక్స్పీరియన్స్ గా మారింది.
ఇప్పుడు ప్యారడైజ్ విషయంలో స్క్రీన్ పై విజువల్స్ ప్రేక్షకులను కూడా స్ట్రాంగ్ ఆకట్టుకుంటే.. సాయికి అది కేవలం మరో సినిమా కాకుండా కెరీర్ మార్చే ప్రాజెక్టుగా మారొచ్చు. ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలకు పనిచేయాలంటే కేవలం కెమెరా పట్టడం సరిపోదు. దర్శకుడి ఆలోచనను అర్థం చేసుకోవాలి. కథకు తగ్గ వరల్డ్ ను క్రియేట్ చేయాలి. ఖ్యంగా హీరో ఇమేజ్, కథ డిమాండ్ చేసే రేంజ్ లో విజువల్స్ చూపించాలి.
ప్యారడైజ్ లో సాయి అదే స్థాయిలో మెప్పిస్తే.. తర్వాత వచ్చే ఛాన్సుల రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్క సినిమా హిట్ తో కెరీర్ పూర్తిగా మారిపోయిన సినిమాటోగ్రాఫర్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు సాయి విషయంలో కూడా అదే చర్చ మొదలైంది. ప్యారడైజ్ లో విజువల్స్ అదిరిపోతే.. రత్నవేలు దగ్గర నేర్చుకున్న ఆ కెమెరామెన్ కు ఇక తిరుగులేనట్లే. వరుసగా భారీ ప్రాజెక్టులు క్యూ కట్టినా పెద్దగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు.
